కర్నూలుకు ప్రభుత్వ ఆఫీసులు... జగన్ సర్కార్ వాదన రెడీ

కర్నూలుకు ఆఫీసుల తరలింపుపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

news18-telugu
Updated: February 18, 2020, 11:52 AM IST
కర్నూలుకు ప్రభుత్వ ఆఫీసులు... జగన్ సర్కార్ వాదన రెడీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కర్నూలుకు ఆఫీసుల తరలింపుపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సచివాలయ భవనాల్లో స్థలం కొరత కారణంగానే తరలిస్తున్నట్టు ఏపీ సర్కార్ అఫిడవిట్‌లో వెల్లడించింది. సచివాలయంలో సంబంధం లేని ఆఫీసుల తరలింపు ప్రతిపాదన ఉందని అందులో పేర్కొంది. ఏపీ విజిలెన్స్ కమిషనర్, పీఆర్‌సీ కమిషనర్‌తో పాటు మరో 10 విభాగాల తరలింపుపై ప్రతిపాదనలు ఉన్నాయని వివరించింది. కర్నూలులో తగిన భవనాలు ఉన్నాయని కలెక్టర్ నివేదిక ఇచ్చారని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో జగన్ సర్కార్ స్పష్టం చేసింది. దీనిపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

విజిలెన్స్ ఆఫీస్, జీఏడీ ఆఫీసు తరలింపుపై వివరణ ఇవ్వాలని కొద్దిరోజుల క్రితం ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విజిలెన్స్ ఆఫీస్ ఓ చోటు, ఉద్యోగులు మరో చోట ఉంటే పని ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ఇక్కడ కార్యాలయాలు సరిపోకపోతే మరో భవనాలను మార్చాలని... కాని ఇతర ప్రాంతాలకు కార్యాలయాలను ఎందుకు తరలిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.






First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు