వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి బదిలీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. ఈ కేసు విచారణ తుది దశలో ఉందని... ఇలాంటి సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు... కేసును ఈ నెల 20కి వాయిదా వేసింది. తదుపరి విచారణ ముగిసేవరకు తుది నివేదికను స్థానిక కోర్టులో దాఖలు చేయొద్దని సిట్(ప్రత్యేక దర్యాప్తు)ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి వైఎస్ వివేకా భార్య వేసిన అనుబంధ పిటిషన్పై ఈ నెల 19లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఏజీని హైకోర్టు ఆదేశించింది.
వివేకా హత్య కేసు విచారణలో భాగంగా అనేకమందిని విచారిస్తున్న సిట్... ఇటీవల మాజీమంత్రి ఆదినారాయణరెడ్డిని సైతం విచారించింది. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని కూడా సిట్ ప్రశ్నించింది. వివేకాను హత్య చేసింది ఎవరో సీఎం జగన్ మనస్సాక్షికి తెలుసు అని వ్యాఖ్యానించిన మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి... ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.