news18-telugu
Updated: January 22, 2020, 7:17 PM IST
సీఎం జగన్
మూడు రాజధానులపై న్యాయపోరాటం అంశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో రాజధాని కేసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులు వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని నియమించుకుంది. ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనకు అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు, మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ తదితర అంశాలపై ఉన్నత న్యాయస్థానంలో నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు రోహత్గీని ప్రభుత్వం నియమించుకుంది. ఇకపై ఆయా కేసులన్నింటినీ రోహత్గీయే వాదించనున్నారు.
Published by:
Kishore Akkaladevi
First published:
January 22, 2020, 7:17 PM IST