హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన నగదు జమ.. ఆ పరిస్థితి తీసుకురావొద్దన్న సీఎం

Jagananna Vidya Deevena: జగనన్న విద్యాదీవెన నగదు జమ.. ఆ పరిస్థితి తీసుకురావొద్దన్న సీఎం

ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడాన్ని పోలీసు వైఫల్యంగానే జగన్ పరిగణించారని చెబుతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని కూడా జగన్ కోరినట్లు తెలిసింది. మరోవైపు దీనిపై మరికాసేపట్లో జగన్ సమీక్ష చేయనున్నారని తెలుస్తోంది.

ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేయడాన్ని పోలీసు వైఫల్యంగానే జగన్ పరిగణించారని చెబుతున్నారు. ఈ వైఫల్యానికి బాధ్యులను గుర్తించాలని కూడా జగన్ కోరినట్లు తెలిసింది. మరోవైపు దీనిపై మరికాసేపట్లో జగన్ సమీక్ష చేయనున్నారని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) ఈ ఏడాది మూడో విడత జగనన్న విద్యాదీవెన పథకం (Jagananna Vidya Deevena Scheme) కింద నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం (AP Government) ఈ ఏడాది మూడో విడత జగనన్న విద్యాదీవెన పథకం (Jagananna Vidya Deevena Scheme) కింద నగదును విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) బటన్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను నేడే తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ప్రతి ఇంట పేదరికం పోవాలి, మన తలరాతలు మారాలన్న.. ప్రతివర్గం పెద్ద చదువులు చదువుకోవాలని ఈ సందర్భంగా సీఎం జగన్ పిలుపునిచ్చార. రాష్ట్రంలో చదువుకునేవారి సంఖ్య బాగా పెరగాలన్న సీఎం.. బాగా చదువుకుంటేనే తలరాతలు మారుతాయన్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు.. దాని నుంచి బయటపడాలన్నారు. నూటికి నూరుశాతం అక్షరాస్యత కానేకాదు, పిల్లలను వందశాతం గ్రాడ్యయేట్లగా నిలబెట్టాలన్నది మన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు

  దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హులైన పేద విద్యార్ధులందరికీ పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కల్పిస్తున్నట్లు సీఎం జగన్ అన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్,డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు చదివే పేద విద్యార్దులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేస్తున్నట్లు వెల్లడించారు. జగనన్న విద్యాదీవెన కింద నగదును తల్లుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా ప్రతీ మూడు నెలలకోసారి కాలేజీలకు నేరుగా వెళ్ళి ఫీజులు చెల్లించడం ద్వారా వారి పిల్లల చదువులు, కాలేజీలలో వసతులు పరిశీలించి లోటుపాట్లు ఉంటే యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారని అభిప్రాయపడ్డారు.

  ఇది చదవండి: 2022లో గవర్నమెంట్ హాలిడేస్ ఇవే.. ఏ పండుగ ఎప్పుడంటే..!


  కాలేజీలలో జవాబుదారీతనం, కాలేజీల స్ధితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ రెండూ జరుగుతాయనే ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఉన్నత విద్య చదివే అవకాశం కల్పించడం కోసం అందరికీ ఈ పథకం వర్తింపజేస్తున్నామన్నారు. ఒకవేళ విద్యార్థుల తల్లులు ఈ నగదు కాలేజీలకు చెల్లించకుంటే.. అలాంటివారికి చెల్లించాల్సిన నగదును వచ్చే ఏడాది నుుంచి నేరుగా కాలేజీల ఖాతాల్లోనే జమ చేస్తామని సీఎం అన్నారు.

  ఇది చదవండి: రాజకీయాల్లోకి ఆనందయ్య.. త్వరలో కొత్త పార్టీ..! బీసీలను పట్టించుకోవడం లేదని కామెంట్..


  గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ఫీజులకు అరకొర మొత్తాలు విదిలించి చేతులు దులుపుకోవడం, అదీ సరైన సమయంలో ఇవ్వకపోవడం వంటి చర్యలకు స్వస్తి పలికామని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,778 కోట్లు బకాయిలను చెల్లించామన్నారు. వాటిని కూడా కలుపుకుంటే ఇప్పటివరకు ఈ పథకం కింద రూ.6,259 కోట్లు చెల్లించినట్లు గుర్తు చేశారు.

  ఇది చదవండి: సీఎం జగన్ నివాసం వద్ద గోశాల... ఎంత అద్భుతంగా ఉందో చూడండి..!


  కరోనా సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. విద్యారంగంలో ప్రవేశపెట్టిన పథకాలపై ఇప్పటివరకు ప్రభుత్వం విద్యారంగంలో అమలు చేస్తున్న పథకాలపై ఇప్పటివరకు 1,99,38,694, మందికి రూ.34,622.17 ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడించారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap welfare schemes

  ఉత్తమ కథలు