ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడి హోదా నుంచి తప్పుకున్న మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులుకు లైన్ క్లియర్ అయింది. సీఎం ఆదేశాలతో రమణదీక్షితులకు ఆలయం ప్రవేశం కల్పించేందుకు టీటీడీ సిద్ధమైంది. ఆగమ సలహాదారుడిగా నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నూతన అర్చకులకు మార్గదర్శకుడిగా రమణదీక్షితులు సేవలను వినియోగించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది. జగన్ ఇచ్చిన హామీ మేరకు రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు.
రమణ దీక్షితులను మళ్లీ టీటీడీలోకి తీసుకుంటూ జారీ అయిన ఉత్తర్వులు
మరోవైపు రమణ దీక్షితులు ఇద్దరు కుమారులను గోవిందరాజు ఆలయం నుంచి శ్రీవారి ఆలయానికి బదిలీ చేయనున్నారు. అప్పట్లో టీటీడీపై బహిరంగంగా ఆరోపణలు చేయడంతో...ఆయనను పాలకమండలి ప్రధాన అర్చకుడి హోదా నుంచి తొలగించిన విషయం తెలిసిందే.