Home /News /andhra-pradesh /

CM YS JAGAN CONDUCTED REVIEW MEETING ON HEALTH DEPARTMENT IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

YS Jagan: ఆగస్టు 15 నుంచి ఏపీలో కొత్త విధానం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. వివరాలివే..!

వైద్య శాఖపై సీఎం జగన్ సమీక్ష

వైద్య శాఖపై సీఎం జగన్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైద్య సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని సీఎం జగన్ (AP CM YS Jagan) అధికారులను ఆదేశించారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. కీలక ఆదేశాలు జారీ చేశారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైద్య సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని సీఎం జగన్ (AP CM YS Jagan) అధికారులను ఆదేశించారు. బుధవారం వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవల సంఖ్య మరింత పెంచాలన్న జగన్.. ఆగస్టు 1 నుంచి పెంచిన చికిత్సలన్నీ ఆరోగ్య శ్రీలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే విలేజ్ క్లినిక్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తప్పనిసరిగా డిజిటల్ వీడియో కనెక్షన్ ఉండాలన్నారు. వైద్య సౌకర్యాల విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక రాష్ట్రంలో నిర్మిస్తున్న కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్న జగన్... ఈ కాలేజీల్లో వీలైనంత త్వరగా క్లాసులు మొదలయ్యేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.

    ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలి. ఆగష్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి అమలు చేయాలని సీఎం సూచించారు. ఆరోగ్య శ్రీ కింద పెంచనున్న చికిత్సల జాబితాను త్వరలోనే ఖరారు చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా 2,446 చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుండగా ఈ సంఖ్య మరింత పెరగనుంది.

    ఇది చదవండి: శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇకపై ఆ కష్టాలకు చెక్.. టీటీడీ కీలక నిర్ణయం..


    ఆరోగ్య శ్రీ ద్వారా అందుతున్న సేవలన్నీ పక్కాగా ఉండాలని.. ఈ పథకం కింద డబ్బులు నేరుగా రోగి వర్చువల్ బ్యాంక్ ఖాతాలోకి అక్కడి నుంచి ఆస్పత్రికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రోగి ఆస్పత్రిలో చేరిన సమయంలో వారి నుంచి ముందుగానే కన్సెంట్ ఫామ్, ట్రీట్ మెంట్ పూర్తైన తర్వాత ధృవీకరణ పత్రం ఇవ్వాలని.. అందులో ఆరోగ్య శ్రీ నుంచి అందిన వైద్యసాయం, ఆ తర్వాత రోగి కోలుకునే వరకు అందుతున్న ఆసరా వంటి వివరాలతో పాటు రోగి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేశారా అనే అంశాలతో పాటు వైద్య సేవలతో సంతృప్తి చెందారా లేదా అనే వివరాలు కూడా తీసుకోవాలన్నారు. ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందించడం కోసం ఎవరైనా లంచం అడిగినా, ఫీజులు వసూలు చేసినా బాధితులు ఫిర్యాదు చేసేలా 14400 లేదా 104 నంబర్లు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, Ys jagan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు