Home /News /andhra-pradesh /

CM YS JAGAN CONDUCTED REVIEW MEETING ON AIRPORTS AND PORTS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

CM Review: 'వన్ డిస్ట్రిక్ట్.. వన్ ఎయిర్ పోర్ట్..' సీఎం జగన్ కొత్త విధానం.. ఏపీలో అభివృద్ధి పరుగులు...

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణంపై సీఎం జగన్ (CM YS Jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణపనులపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణంపై సీఎం జగన్ (CM YS Jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణపనులపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలిచ్చారు. వన్‌ డిస్ట్రిక్ట్‌ – వన్‌ ఎయిర్‌పోర్టు ఉండాలన్నదే తమ కాన్సెప్ట్ అని సీఎం అన్నారు. దానికి అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలన్న సీఎం.. ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

    విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని.., ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలని.., నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కావాలని స్పష్టం చేశారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.., రద్దీకి తగినట్లుగా మౌలికసదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు.

    ఇది చదవండి: ఆ నేతల మీటింగ్ తర్వాత పవన్ వ్యూహం మార్చారా..? అందుకే ఆ కామెంట్స్ చేశారా..?


    సీపోర్టులు పైనా సీఎం సమీక్ష
    రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్‌ల పనుల ప్రగతిపై అధికారులు సీఎంకు వివరాలు అందజేశారు. రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టాలన్నారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయన్న అధికారులు వెల్లడించారు.

    ఇది చదవండి: టీడీపీలో ఏం జరగుతోంది..? చంద్రబాబే లోకేష్ ను పక్కనబెడుతున్నారా..? కారణం ఇదేనా..?


    ఫిషింగ్‌ హార్భర్లు
    రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్భర్లలో తొలిదశలో నిర్మాణం చేపడుతున్న 4 ఫిషింగ్‌ హార్బర్లను అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. తొలిదశలో ఉప్పాడ(తూర్పుగోదావరి), నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా), జువ్వలదిన్నె(నెల్లూరు) జిల్లాల్లో ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణ చేపట్టనున్నట్లు తెలిపారు. రెండో విడతలో చేపడుతున్న మిగిలిన 5 హార్భర్ల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాలపరిమితిలోగా నిర్మిస్తామన్నారు. ఈ 5 ఫిషింగ్‌ హార్భర్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామన్న అధికారులు.., ఫేజ్‌ 2లో బుడగట్లపాలెం(శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం), బియ్యపుతిప్ప(పశ్చిమగోదావరి), ఓడరేవు(ప్రకాశం), కొత్తపట్నం(ప్రకాశం) జిల్లాలలో ఫషింగ్ హార్బర్లు నిర్మిస్తామన్నారు.

    ఈ సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు