CM YS JAGAN CONDUCTED MEETING WITH INDUSTRIALISTS IN WORLD ECONOMIC FORUM SUMMIT FULL DETAILS HERE PRN
YS Jagan in Davos: గ్రీన్ ఎనర్జీ హబ్ గా ఏపీ.. రూ.1.25లక్షల కోట్ల ఒప్పందాలు
అదానీతో సీఎం జగన్
దావోస్ (Davos) పర్యటనలో సీఎం జగన్ (CM YS Jagan) బిజీబిజీగా గడుపుతున్నారు. పలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన.. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు, మరో మూడు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
దావోస్ (Davos) పర్యటనలో సీఎం జగన్ (CM YS Jagan) బిజీబిజీగా గడుపుతున్నారు. పలు కీలక సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన.. ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతున్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్ని పెట్టుబడులు, మరో మూడు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ మేరకు సీఎం సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. మొత్తంగా 14వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీకోసం రూ. 65వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. అలాగే 18వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. మచిలీపట్నంలో గ్రీన్ ఎనర్జీ ఆధారంగా ఎస్ఈజెడ్ ఏర్పాటుపైనా ఎంఓయూ చేసుకున్నారు. దావోస్ టూర్ రెండో రోజు రూ.60వేల కోట్ల పెట్టుబడితో 13,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీకోసం అదానీతో అవగాహనా ఒప్పదం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10వేలమందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి.
ఒక్ర గ్రీన్ ఎనర్జీ విభాగంలోనే దావోస్ వేదికగా రూ. 1.25 లక్షల కోట్ల అవగాహనా ఒప్పందాలు చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీలో కర్బన రహిత విద్యుత్ ఉత్పత్తికి గ్రీన్కో - ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహనా ఒప్పందం కుదురింది. 8వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తిపై అవగాహనా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో వేయి మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, 5వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 2వేల మెగావాట్ల విండ్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికోసం రూ.37వేల కోట్ల పెట్టుబడి, తద్వారా దాదాపు 10వేలమందికి ఉద్యోగాలు రానున్నాయి.
అలాగే మరో 6వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై అరబిందో రియాల్టీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పదం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2వేల మెగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్టు, మరో 4వేల మెగావాట్ల సోలార్ మరియు విండ్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రానున్నాయి. ప్రస్తుతం కాకినాడ ఎస్ఈజెడ్లో సదుపాయాలను వినియోగించుకుని అరిబిందో రియాల్టీ ఈ ప్రాజెక్టులను చేపట్టనుంది. దీనికోసం దాదాపు రూ.28వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దాదాపు 8వేలమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముంది.
ఇక కృష్ణాజిల్లా మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుపై ఏంఓయూ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. గ్రీన్ ఎనర్జీతో సహాయంతో ఈ జోన్లో పారిశ్రామిక ఉత్పత్తి ప్రారంభించి., కంపెనీలకు అవసరమైన వసతులు కల్పిస్తారు.
ఇప్పటికే రూ.60వేల కోట్ల పెట్టుబడితో 13,700 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీకోసం అదానీతో అవగాహనా ఒప్పదం చేసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 10వేలమందికిపైగా ఉద్యోగాలు రానున్నాయి. ఒక గ్రీన్ ఎనర్జీ విభాగంలోనే దావోస్ వేదికగా రూ. 1.25 లక్షల కోట్ల అవగాహనా ఒప్పందాలు కుదిరాయి.
ఏపీ పెవిలియన్లో ప్రఖ్యాత స్టీల్ కంపెనీ ఆర్సెల్విట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్తో సీఎం.జగన్ భేటీ అయ్యారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిపై చర్చ. గ్రీన్కో భాగస్వామ్యంతో ఏపీలోకి అడుగుపెడుతున్నామని ఆదిత్య మిట్టల్ ప్రకటించారు. ప్రపంచంలోనే తొలి హైడ్రో పంప్డ్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతున్నామని వెల్లడించారు. తమ కంపెనీ తరఫున 600 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతున్నట్టు.. సీఎంతో చర్చ తర్వతా ఈ విషయాలను డీ కార్బనైజ్ ఎకానమీపై జరిగిన సదస్సులో అదిత్య మిట్టల్ ప్రకటించారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.