Home /News /andhra-pradesh /

CM YS JAGAN ASSIGNS LATE GAUTHAM REDDY RESPONSIBILITIES TO ANOTHER MINISTER FULL DETAILS HERE PRN

Goutham Reddy: గౌతమ్ రెడ్డి శాఖలు ఆ మంత్రికి అప్పగింత.. సీఎం జగన్ కీలక నిర్ణయం.. గవర్నర్ ఉత్తర్వులు..

గౌతమ్ రెడ్డి శాఖలపై సీఎం జగన్ కీలక నిర్ణయం

గౌతమ్ రెడ్డి శాఖలపై సీఎం జగన్ కీలక నిర్ణయం

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) శాఖలపై సీఎం జగన్ (CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన శాఖలను మరో కీలక మంత్రికి అప్పగించారు.

    దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati autham Reddy) శాఖలపై సీఎం జగన్ (CM YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ఆకస్మిక మరణంలో ఆయన నిర్వహిస్తున్న ఐదు శాఖలు ఖాళీ అయ్యాయి. ఏ మంత్రికి లేని విధంగా ఆరు శాఖలను సీఎం జగన్.. గౌతమ్ రెడ్డికి అప్పగించారు. ఆయన కూడా తన శాఖలను సమర్ధవంతంగా నిర్వర్తించారు. ఆయన హఠాన్మరణంతో ఆ శాఖలు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో గౌతమ్ రెడ్డి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు గౌతమ్ రెడ్డి శాఖలపై సభలో సమాధానాలిచ్చే బాధ్యతను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు అప్పగించిన సంగతి తెలిసిందే.

    ఐతే ఆయా శాఖల పూర్తి బాధ్యతలపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి శాఖలన్నింటినీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమ్ రెడ్డి ఐటీ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, స్కిల్ డెవలప్ మెండ్ అండ్ ట్రైనింగ్, చేనేత, జౌళి శాఖలను నిర్వహించారు. ఇప్పుడీ బాధ్యలన్నీ బుగ్గనకు బదిలీ అయ్యాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన ఛార్జ్ తీసుకునే అవకాశముంది.

    గౌతమ్ రెడ్డి శాఖలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగింత

    ఇది చదవండి: కల్తీమద్యంపై సీఎం కీలక ప్రకటన.. జంగారెడ్డిగూడెం ఇష్యూలో క్లారిటీ ఇచ్చిన జగన్


    ఐతే ఈ బాధ్యతల అప్పగింత తాత్కాలికమా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. మంత్రివర్గంలో మార్పుల గురించి ఇటీవల సీఎం జగన్ ప్రస్తావించిన నేపథ్యంలో బుగ్గన కంటిన్యూ అవుతారా.. లేదా అనేది అందర్నీ తొలుస్తున్న ప్రశ్న. కేబినెట్ మార్పులు జరిగే వరకు గౌతమ్ రెడ్డి శాఖలు బుగ్గన దగ్గర ఉంచి ఆ తర్వాత కొత్త మంత్రికి అప్పగిస్తారన్న ప్రచారం ఉంది.

    ఇది చదవండి: వైఎస్ జగన్ తో రాజమౌళి భేటీ.. ఆర్ఆర్ఆర్ కి సీఎం వరాలిస్తారా..?


    ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలసిందే. దుబాయ్ లో జరిగిన పెట్టుబడుల సదస్సుకు హాజరైన మంత్రి.. తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మరోవైపు మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆయన పేరిట అగ్రికల్చర్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని.. అందుకోసం తమ కుటుంబానికి చెందిన రూ.225 కోట్లు విలువ చేసే మెరిట్స్ కాలేజీ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తామని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి.. సీఎం జగన్ ను కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన కూడా చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Buggana Rajendranath reddy, Mekapati Goutham Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు