Home /News /andhra-pradesh /

CM YS JAGAN AND TDP CHIEF CHANDRA BABU ATTEND TO GOVERNOR TEA PARTY AT RAJBHAVAN VIJAYAWADA UMG

Rajbhavan: 'ఎట్ హోం'లో ఎడమొహం.. పెడమొహం..! అందరూ ఊహించినట్లే తలో దిక్కున జగన్, చంద్రబాబు

రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందుకు హాజరైన జగన్, చంద్రబాబు

రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందుకు హాజరైన జగన్, చంద్రబాబు

స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ అందించే తేనీటి విందు (Tea Party) కార్యక్రమం ఒక్కసారిగా ఏపీ రాజకీయాలను అటువైపు తిప్పేలా చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ రాజ్‌భవన్‌ (RajBhavan)లో ఒకే వేదికపైకి రావడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ అందించే తేనీటి విందు (Tea Party) కార్యక్రమం ఒక్కసారిగా ఏపీ రాజకీయాలను అటువైపు తిప్పేలా చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ రాజ్‌భవన్‌ (RajBhavan)లో ఒకే వేదికపైకి రావడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. అయితే, అందరూ ఊహించినట్లుగానే ఆ ఇద్దరూ ఎడమొహం.. పెడమొహంగానే తలో దిక్కున కూర్చున్నారు. ఈ తేనీటి విందుకు పవన్ కల్యాణ్ రాకపోవడం గమనార్హం.

    ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతీతో హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. అచ్చెన్నాయుడు, కేశినేని నానితో కలిసి హాజరయ్యారు. ఈ ఎట్ హోం కార్యక్రమానికి ఏపీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. గవర్నర్ అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలకు కూడా ఆహ్వానం పంపారు. అయితే, ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ వస్తారని అనుకున్నా చివరి నిమిషంలో ఆయన ప్రోగ్రామ్ క్యాన్సల్ అయింది.

    ఇదీ చదవండి: ఇందిరాగాంధీ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు.. ఆకట్టుకున్న విన్యాసాలు


    ప్రధాన టేబుల్ వద్ద సీఎం జగన్ దంపతులు, గవర్నర్ దంపతులతో పాటు హైకోర్టు సీజే పీకే మిశ్రా దంపతులు కూర్చున్నారు. వేదిక ఎడమ వైపు టేబుల్ వద్ద చంద్రబాబు, అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని మరికొందరు టీడీపీ నాయకులు కూర్చున్నారు. కార్యక్రమంలో జగన్, చంద్రబాబు ఒకరికొకరు ఎక్కడా ఎదురు పడలేదు. అయితే, పాత పగలను పక్కనబెట్టి జగన్, చంద్రబాబు మధ్య పలకరింపులు జరుగుతాయని అనుకున్న అందరికీ ఇది నిరాశనే మిగిలించింది.

    ఇదీ చదవండి: అమ్మాయిది జర్మనీ.. అబ్బాయిది ఆంధ్రా.. పెళ్లేమో అమెరికాలో..! ఆహా.. మూడు దేశాల ముచ్చటైన కల్యాణం..!!


    గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి దంపతులకు ఎదురెళ్లి మరీ ఆహ్వానం పలికారు. అదేవిధంగా ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరినీ ఆయన ఆప్యాయంగా పలకరించడం విశేషం. ప్రతీ టేబుల్ దగ్గరకు వెళ్లి మరీ గవర్నర్ పలకరించారు. జాతీయ గీతం ఆలపించిన తర్వాత తేనీటి విందు కార్యక్రమం మొదలుపెట్టారు.



    అంతకుముందు, గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో చంద్రబాబు పాల్గొని రానున్న 25 ఏళ్లకు విజన్ 2047 లక్ష్యాలను వివరించారు. ఢిల్లీలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో తాను చేసిన సూచనలను ప్రజలకు చంద్రబాబు వివరించారు. రైతుల కోసం ప్రత్యేకమైన విధానాలు రూపొందించాలని.. 75 ఏళ్ల తర్వాత కూడా రైతు ఆత్మహత్యలు దేశానికి గౌరవం కాదని చెప్పారు. దేశంలో నదుల అనుసంధానం ప్రారంభం కావాలని.. ఏపీలో గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేశామంటూ ఆయన గుర్తు చేశారు.
    First published:

    Tags: Biswa Bhushan Harichand, Chandrababu Naidu, Vijayawada, Ys jagan

    తదుపరి వార్తలు