Turlapati Kutumba Rao: సీనియర్ జర్నలిస్టు, బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ పత్రికా రచయిత, 'పద్మశ్రీ' డాక్టర్ తుర్లపాటి కుటుంబరావు (89) ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కుటుంబరావు మృతిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి... దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. "ప్రముఖ జర్నలిస్టుగా, మంచి వక్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కుటుంబరావు ఎన్నో సేవలు అందించారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు... అలాగే తెలుగు సాహిత్యానికి ఆయన ఎనలేని సేవలు చేశారు. గొప్ప జర్నలిస్టు" అని ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు.
తుర్లపాటి కుటుంబరావు మృతిపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. “సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి కుటుంబరావుగారి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది. తుర్లపాటి కుటుంబరావుగారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి కుటుంబరావుగారి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది.(1/2) pic.twitter.com/DaQ2zeip74
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) January 11, 2021
అలాగే డిప్యూటీ సీఎం ఆళ్ల నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి సేవలు శ్లాఘనీయం. పద్మశ్రీ, కళాప్రపూర్ణ తదితర అనేక పురస్కారాలే తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలు. ఆయన మృతితో బహుముఖ ప్రజ్ఞావేత్తను రాష్ట్రం కోల్పోయింది.., తుర్లపాటి కుటుంబరావు గారి మరణం యావత్ సాహితీ, సాంసృతీ ప్రపంచానికి తీరని లోటు” అని ఆళ్లనాని పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తుర్లపాటి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. “ఆయన జర్నలిజంలో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందడం గర్వించదగ్గ పరిణామన్నారు. కుటుంబరావు రాసిన పుస్తకాలు అందరికీ ఆదర్శం అన్నారు. సుధీర్ఘకాలం జర్నలిజం వృత్తిలో మకుఠం లేని వ్యక్తిగా కుటుంబరావు నిలిచారు” అని పేర్కొన్నారు
తుర్లపాటి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పత్రికారంగానికి ఆయనొక మార్గదర్శి అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కుటుంబరావు మరణంపై ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే సంతాపం తెలిపింది. "ఆయన మరణం ఎంతో దిగ్భ్రాంతికరం" అంటూ ఆయన మృతి పట్ల ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్ వసంత్ ఓ ప్రకటనలో సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alla Nani, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Vellampalli srinivas