news18-telugu
Updated: December 28, 2019, 6:32 AM IST
వైఎస్ జగన్
ఓవైపు రాజధాని అంశంపై అమరావతిలో కాక రేగుతుంటే... మరోవైపు సీఎం జగన్ తను చెయ్యాలనుకున్న పనులు చేసుకుంటూ పోతున్నారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన సీఎం జగన్... వైజాగ్ని పరిపాలక రాజధానిగా చేస్తారనే ప్రచారం జరుగుతున్న వేళ... ఆయన విశాఖ పర్యటనకు వెళ్తుండటం అందరినీ ఆలోచనలో పడేస్తోంది. విశాఖలో రెండు రోజులపాటూ విశాఖ ఉత్సవ్ జరగనుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు జగన్ వైజాగ్ వెళ్తున్నారు. కైలాస గిరిపై రూ.37 కోట్లతో ప్లానెటోరియం పనులకు జగన్ పునాదిరాయి వేస్తారు. అలాగే... ఉడా సెంట్రల్ పార్కులో రూ.380 కోట్లతో VM RDA పనులు, రూ.800 కోట్లతో GVMC పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇందుకోసం మధ్యాహ్నం 2.30కి గన్నవరం ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్లే సీఎం జగన్... 3.50కి విశాఖ చేరుకుంటారు. తర్వాత 4.20కి కైలాసగిరిపై పనులకు శ్రీకారం చుడతారు. నెక్ట్ 5.10కి YSR సెంట్రల్ పార్క్ దగ్గర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 6 గంటలకు రామకృష్ణ బీచ్ దగ్గర విశాఖ ఉత్సవ్ ప్రారంభిస్తారు. 7.40కి గుంటూరులోని తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకుంటారు. ఇలా టూర్ షెడ్యూల్ ఖరారు చేసిన ప్రభుత్వ వర్గాలు అందుకు అన్ని ఏర్పాట్లూ చేశాయి.
Published by:
Krishna Kumar N
First published:
December 28, 2019, 6:32 AM IST