Cm Jagan On Ap Capital: ఏపీ రాజధానిపై సీఎం జగన్ (Cm Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ ఏపీ రాజధానిగా మారబోతుంది. నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతానని జగన్ (Cm Jagan) వ్యాఖ్యానించారు. ఇక విశాఖ కేంద్రంగానే రాష్ట్ర కార్యకలాపాలు జరగనున్నాయి. అంతేకాదు సీఎం ఆఫీస్ కూడా విశాఖలోనే ఉండబోతున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ (Global Summit Meeting) సాక్షిగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మార్చి 3,4వ తేదీల్లో విశాఖలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్ సమావేశానికి (Global Summit Meeting) భారీగా పెట్టుబడిదారులు రావాలని జగన్ (Cm Jagan) కోరారు.
ప్రపంచ వేదికపై ఏపీని నిలబెట్టడానికి మీ సహకారం కూడా కావాలని జగన్ చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామని జగన్ (Cm Jagan) తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ (Ap)గడిచిన మూడేళ్లలో నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం జగన్ (Cm Jagan) ఈ సందర్బంగా గుర్తు చేశారు. సింగిల్ డెస్క్ సిస్టం ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. 11.43 శాతం వృధ్దిరేటుతో దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీనని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఆరు పోర్టులు కార్యాలకలాపాలు నిర్వహిస్తున్నాయి. అలాగే మూడు కారిడార్లున్నాయి. ఏపీకి సుదీర్ఘ చరిత్ర ఉందని జగన్ (Cm Jagan) వ్యాఖ్యానించారు.
కాగా ప్రభుత్వం మొదటి నుంచి కూడా 3 రాజధానులకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో రాజధానికి సంబంధించి ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టి ముందుకెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. మరి సీఎం జగన్ (Cm Jagan) వ్యాఖ్యలపై ప్రతిపక్ష నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
కాగా ఏపీలో రాజధాని (Ap Capital) రగడ ఇంకా కొనసాగుతుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు (High Court) తీర్పునిచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. దీనిపై నేడు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. మరి రాష్ట్ర రాజధానిపై సుప్రీంకోర్టు (Supreme Court) ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Ap cm jagan, Visakhapatnam