Jr NTR: ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నచిత్రం ఆర్ఆర్ఆర్ (RRR).. ముఖ్యంగా నందమూరి, మెగా అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రికార్డులు తిరగరాస్తుందని ఆశిస్తున్నారు. కచ్చితంగా ఆర్ఆర్ఆర్ విడుదలైన తర్వాత కలెక్షన్ల విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన నేపథ్యంలో అదనపు ప్రయోజనాలు చేకూరేలా చేయాలని ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli), డీవీవీ దానయ్య (DVV Dhannayya)లు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan MOhan Reddy)ని ఇటీవల కలిశారు. అలా కలిశారో లేదో.. ఇలా శుభవార్త చెప్పారు సీఎం జగన్.. భీమ్లా నాయక్ (Bheemla Nayak).. రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాలను లైట్ తీసుకుంది ప్రభుత్వం.. భీమ్లా నాయక్ సంగతి అలా ఉంచితే.. ప్రభాస్ (Prabhas) స్వయంగా సీఎం ను కలిసినా సినిమాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. అందుకు ప్రభుత్వం పెట్టిన కండిషనే కారణం.. ఏపీలో 20 శాతానికిపైగా షూటింగ్ జరిగిన సినిమాలకే టికెట్లు పెంచుకునే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆర్ఆర్ఆర్ కూడా ఏపీలో షూటింగ్ జరుపుకోలేదు. కానీ శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం.. దీనికి కారణం జూనియర్ ఎన్టీఆర్ (JR NTR) వీడియో కాల్ తో పాటు.. నందమూరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మంత్రి దగ్గరుండి వ్యవహారం నడిపినట్టు సమాచారం.
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం కొన్నిరోజుల క్రితం జరిగిన సమావేశంలో జగన్ ను కలవాల్సిన సెలబ్రిటీల జాబితాలో ఎన్టీఆర్ ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల తారక్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇటీవల దర్శకుడు రాజమౌళి.. నిర్మాత డీవీవీ దానయ్యలు ఇటీవల సీఎంను కలిసిన సందర్భంలో.. జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ చేశారని ఆ కాల్ లో ఆర్ఆర్ఆర్ సినిమాకు బెనిఫిట్ కలిగేలా తారక్ రిక్వెస్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. గతంలో కూడా బాలయ్య.. అఖండ సినిమా విషయంలో.. బాలయ్య వైసీపీ నేతతో సందేశం పంపితే.. జగన్ ఆయనకు ఏం కావాలో చూడాలన్నరాని.. ఆ తరువాత తాను బాలయ్యతో మాట్లాడి.. ఆయనకు ఫేవర్ చేశామని మంత్రి పేర్ని నాని చెప్పారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ ఆర్ఆర్ఆర్ సినిమాకు శుభవార్త చెప్పేలా చేసిందని టాలీవుడ్ టాక్.
అయితే రాజమౌళి, దానయ్యకు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో పాటు.. జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడేలా చేయడంలో ఓ మంత్రి కీలక పాత్ర పోషించారని సమాచారం. నందమూరి కుటుంబంతో అత్యంత సన్నిహిత్యంగా ఉండే మంత్రే ఈ వ్యవహారం అంతా నడిపారని తెలుస్తోంది. ఆ మంత్రే చొరవ తీసుకుని.. సీఎం జగన్ తో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మీట్ అయ్యేలా చేశారని.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ను వీడియో కాల్ చేయమని కోరింది కూడా ఆ మంత్రే అని ప్రచారంలో ఉంది. ప్రభుత్వం పెట్టిన కండిషన్ ప్రకారం ఏపీలో సినిమా షూటింగ్ జరగకపోయినా.. ఆ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడంలో.. ఆ మంత్రి చొరవే పని చేసిందనే ప్రచారం ఉంది.
ఇదీ చదవండి : సాగర తీరంలో స్వామి వారి దర్శనానికి వేళాయే.. ప్రత్యేకతలు ఎన్నో తెలుసా..?
అయితే దీనిపై అధికారికంగా స్పందించడం లేదు.. ప్రభుత్వం ఎలాగూ దీనిపై మాట్లాడదు.. మంత్రి కొడాలి నాని కాని.. జూనియర్ ఎన్టీఆర్ కానీ స్పందించే అవకాశం లేదు. అయితే దర్శకుడు రాజమౌళి లేదా.. నిర్మాతలు మాట్లాడితే విషయం వెలుగులోకి వస్తుంది.. ఏదీ ఏమైనా ఇలా నందమూరి హీరో.. జగన్ కు వీడియో కాల్ చేయడం.. చంద్రబాబు అంటేనే అంత ఎత్తున విరుచుకుపడే మంత్రి.. నందమూరి కుటుంబంతో మరోసారి తన బంధాన్ని బయట పెట్టుకోవడం.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Jr ntr, Kodali Nani, Prabhas, Rrr movie