కరోనా వైరస్ సోకి మనిషి చనిపోయి బాధపడుతున్న వారిపట్ల ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం సరికాదని, ఇలాంటి ఘటనలు అవమాననీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కరోనాపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చించారు. కరోనా అనేది ఎవరికైనా సోకొచ్చు.. మనకుఇలాంటివి జరిగితే ఏలా స్పందిస్తామో.. అలాగే స్పందించాలి తప్ప బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు అడ్డుకోవడం కరెక్టు కాదని చెప్పారు. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్గా స్పందించాలని డీజీపీకి సూచించారు. కరోనా వచ్చినవారిని అంటరాని వారిగా చూడడం సరికాదని, కరోనా సోకితే మందులు వేసకుంతే పోతుందన్న విషయాన్ని గుర్తు చేశారు.
కరోనా వైరస్ పట్ల తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రయత్నం చేయోద్దని, అలా చేసిన వారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా సోకిన వారికి నయం అవుతుందని, లేనిపోని వదంతులను సృష్టించొద్దని సూచించారు. దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26 శాతమే ఉందని, కేవలం దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే వైరస్ అధికంగా ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు.
Published by:Narsimha Badhini
First published:April 30, 2020, 15:09 IST