Home /News /andhra-pradesh /

CM JAGAN RELEASED AMOUNT TO FARMERS IT THE PROCESS TO KNOW YOUR YSR RAITHU BHAROSA PAYMENT STATUS NGS

Rythu Bharosa: రైతుల ఖాతాలోకి రూ.1,036 కోట్ల భరోసా జమ.. ఇలా చెక్ చేసుకోండి.. రాకపోతే ఏం చేయాలంటే..?

రైతు భరోసా

రైతు భరోసా

Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు శుభవార్త. 50 లక్షలమందికిపైగా రైతులకు వేయి 36 కోట్ల రూపాయల నగదు వారి అకౌంట్లోకి జమ చేశారు సీఎం జగన్.. రైతు భరోసా- పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయాన్నిసీఎం రిలీజ్ చేశారు. అయితే నగదు పడిందో లేదో ఇలా చెక్ చేసుకోండి.. ఒకవేళ రాకపోతే ఏం చేయాలి అంటే..?

ఇంకా చదవండి ...
  Rythu Bharosa: ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM  Jagan Mohan Reddy)  సంక్షేమాన్ని వీడడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం మరోసారి రైతుభరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేశారు. రైతుభరోసా- పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ నిధులను నేరుగా రైతుల అకౌంట్టోకి వేశారు. ఏపీ వ్యాప్తంగా 50,58,489 మంది రైతులకు 1,036 కోట్ల రూపాయలను తాడే పల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. తాజా నగదుతో కేవల 2021–22 సీజన్‌లో 6,899.67 కోట్లు రూపాయల నగదు జమ కానుండగా, గడిచిన మూడేళ్లలో ఈ పథకం కోసం 19,812.79 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించింది ఏపీ ప్రభుత్వం (AP Government). సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో మొత్తంగా 13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందించామన్నారు సీఎం జగన్. తమ ప్రభుత్వం ఎప్పటికీ రైతుల పక్షపాతిగా ఉంటుంది అన్నారు.

  వైసీపీ ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 13,500 రూపాయల సాయం విడతల వారీగా అందిస్తోంది. ముఖ్యంగా రైతుల అవసరాలను గుర్తించి.. ఏ సీజన్ లో రైతులకు నగదు అవసరం పడుతుంది అన్న విషయాన్ని గుర్తించి.. ఆయా సమయాల ప్రకారం ఇలా విడతల వారిగా నగదు అందిస్తోంది జగన్ సర్కార్. మొదటి విడతగా ఖరీఫ్‌ పంట వేసే ముందు.. అంటే మే నెలలో 7,500 రూపాయలను జమ చేస్తోంది. ఇక రెండో విడతగా అక్టోబర్‌ నెల ముగిసేలోపే ఖరీఫ్‌ పంట కోత సమయం, అంటే రబీ అవసరాల కోసం 4,000 రూపాయాలను అందిస్తోంది. ఇక మూడవ విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో 2,000 రూపాయల చొప్పును అందిస్తూ వస్తోంది ఏపీ ప్రభుత్వం.

  ఇదీ చదవండి : రాహు కేతు పూజలో బాలీవుడ్ తలైవి.. లవ్ లెటర్స్ కావాలా? పూజకు కారణం తెలిస్తే షాక్ అవుతారు

  సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలనికే.. అంటే 2019 అక్టోబర్‌ 15 న మొదట ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. తొలి ఏడాది 45 లక్షల రైతు కుటుంబాలకు 6,162.45 కోట్లు జమచేశారు. దీనికి పీఎం కిసాన్‌ కింద 2,525 కోట్లు కేంద్రం, వైఎస్సార్‌ రైతుభరోసా కింద 3,637.45 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాయి. ఇక రెండో ఏడాది 2020–21లో 49.40 లక్షల రైతు కుటుంబా లకు 6,750.67 కోట్లు జమచేశారు.

  ఇదీ చదవండి : ఆ కారును వాడాలంటే భయపడుతున్న అశోక్ గజపతి రాజు.. ఎందుకో తెలుసా..?

  సీఎం జగన్ నగదు జమ చేసిన కాసేపటికే చాలామంది రైతుల ఖాతాల్లో నగదు క్రెడిట్ అయింది. కొంతమందికి ఇంకా డబ్బులు పడలేదు. దీంతో నగదు వచ్చాయా లేదా.. అని తెలుసుకునేందుకు రైతులు అందరికీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. తమకు నగదు పడిందో లేదో తెలుసుకోవడానికి రైతు ఆధార్ నెంబర్ ఉంటే చాలు.. చాలా సులభంగా స్టేటస్ తెలుసుకునే అవకాశముంది. దీని కోసం రైతు భరోసా వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సబ్ మిట్ చేయాలి. వెంటనే మీ పేమెంట్ స్టేటస్ తెలిసిపోతుంది.

  ఇదీ చదవండి : ఆ ఇద్దరి హీరోల కోసమే ఇదంతా..? ఏపీ ప్రభుత్వం కరోనా లాంటింది..? ఆర్జీవి సంచలన వ్యాఖ్యలు

  ఒకవేళ ఎవరికైనా నగదు రాకపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.. వారం లోపు ఎప్పుడైనా జమ కావొచ్చు.. అప్పటికీ నగదు జమ కాకుంటే దగ్గర్లో ఉన్న సచివాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. మీ ఆధార్ కార్డు ఆధారంగా వెంటనే డిటైల్స్ అప్ లోడ్ చేస్తారు. ఎక్కడ పొరపాటు జరిగిందో గుర్తించి వెంటనే మళ్లీ నగదు పడేలా చేస్తారని అధికారులు చెబుతున్నారు..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Rythu Bharosa

  తదుపరి వార్తలు