హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan : నా సైన్యానికి సెల్యూట్.. వాలంటీర్లకు సీఎం జగన్ సత్కారం..

CM Jagan : నా సైన్యానికి సెల్యూట్.. వాలంటీర్లకు సీఎం జగన్ సత్కారం..

వైఎస్ జగన్

వైఎస్ జగన్

వాలంటీర్ల (Volunteers) సేవా భావానికి తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan). పల్నాడు జిల్లా (Palanadu District) నరసరావుపేట లో జరిగిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వారి సేవలను అభినందించారు.

  వాలంటీర్ల (Volunteers) సేవా భావానికి తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan). పల్నాడు జిల్లా (Palanadu District) నరసరావుపేట లో జరిగిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వారి సేవలను అభినందించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థవైపు దేశం మొత్తం చూడటం గర్వంగా ఉందని ఆయన అన్నారు. వివక్ష, లంచం, అవినీతిలకు తావులేకుండా, కులమతరాజకీయాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థ కోసం కల గన్నామని, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఆ కల సాకారమైందని జగన్‌ అభిప్రాయపడ్డారు. తమకు ఎంత లాభం వస్తుందనేది లెక్కేసుకోకుండా.. సేవమాత్రమే లెక్కలు వేసుకొని పేదల కళ్లలో సంతోషాన్ని, సంతృప్తిని చూడటానికి వాలంటీర్లు కష్టపడుతున్నారని సీఎం అన్నారు.

  రాష్ట్రంలో 2 లక్షల 60 వేలమంది సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాని ఆయన అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 30వేల మంది పనిచేస్తున్నారని.. అదే గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు వాలంటీర్ ను నియమించి వివక్షకు తావులేకుండా పథకాలను అందిస్తున్నట్లు జగన్ చెప్పారు. ప్రభుత్వ పనుల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాలన్న భ్రమను తొలగించి.. లంచాలిస్తే తప్ప పనులు జరగవనే అపవాదుకు పాతర వేసి పారదర్శకమైన పాలన అందిస్తున్నామని జగన్ అన్నారు. ఇప్పటివరకు వాలంటీర్లు రూ.50,508 కోట్లను ప్రజలకు పంచారని సీఎం గుర్తుచేసారు. ఇప్పటివరకు లక్షా 34వేల కోట్ల రూపాయలను ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా ప్రతి ఇంటికి అందిస్తున్నామని అన్నారు.

  ఇది చదవండి: ఏపీలో భారీగా పెరిగిన భూముల ధరలు.. విజయవాడలో గజం ఎంతంటే..!


  ఇలాంటి పాలన గతంలో ఎప్పుడూ లేదని జగన్ చెప్పారు. సెలవురోజుల్లో, పండుగ రోజుల్లో, కరోనా విపత్తు సమయంలో వెన్నుచూపకుండా ప్రజాసేవే పరమావధిగా సేవలందిస్తున్న మహాసైన్యాన్ని చూసి గర్వపడుతున్నట్లు జగన్ తెలిపారు. వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న చిరుసత్కారాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. వాలంటీర్ల సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ప్రతిఏటా సత్కరిస్తున్నామన్నారు. 4,136 వాలంటీర్లకు సేవారత్న కింద రూ.20వేల నగదు, శాలువా సత్కరించి మెడల్ ఇస్తున్నామన్నారు. సేవా వజ్ర అవార్డు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 875 మందికి సేవా వజ్ర అవార్డు కింద రూ.30వేల నగదు, మెడల్, శాలువాతో సత్కరిస్తున్నట్లు తెలిపారు.

  ఇది చదవండి: జిల్లాల విభజన రోజాకు ప్లస్ గా మారిందా..? సాయంత్రమే శుభవార్త వినబోతున్నారా..?


  రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 లక్షల 33వేల మందికి రూ.239 కోట్లు బహుమానంగా ఇస్తున్నామన్నారు. గత ఏడాది రూ.226 కోట్లు ఇస్తే.. ఈసారి రూ.239 కోట్లతో కలిపి మొత్తం రూ.465 కోట్లు ఇచ్చినట్లు జగన్ తెలిపారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Gram volunteer

  ఉత్తమ కథలు