హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ap: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ అప్డేట్..CBI ముందుకు సీఎం ఓఎస్డీ

Ap: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ అప్డేట్..CBI ముందుకు సీఎం ఓఎస్డీ

వైఎస్ వివేకానందరెడ్డి (ఫైల్ ఫొటో)

వైఎస్ వివేకానందరెడ్డి (ఫైల్ ఫొటో)

మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఇక తాజాగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. కాగా గతంలో కృష్ణ మోహన్ కు అలాగే వైఎస్ భారతి ఇంట్లో పని చేసే నవీన్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో నేడు కడప కేంద్ర కర్మాగారంలో సీబీఐ ముందుకు వచ్చారు. మరి వీరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

మాజీ మంత్రి, వైఎస్సార్ సోదరుడు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఇక తాజాగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. కాగా గతంలో కృష్ణ మోహన్ కు అలాగే వైఎస్ భారతి ఇంట్లో పని చేసే నవీన్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో నేడు కడప కేంద్ర కర్మాగారంలో సీబీఐ ముందుకు వచ్చారు. మరి వీరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Ap: విద్యార్థులకు శుభవార్త..'జగనన్న విదేశీ విద్యాదీవెన' నిధులు విడుదల

జనవరి 23న మొదటిసారి ఎంపీ అవినాష్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసుల్లో జనవరి 24న విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే ఈ నోటిసులపై అవినాష్ రెడ్డి స్పందించారు. నోటీసులు ఇచ్చి ఒక్క రోజులో రావాలంటే ఎలా? ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు రాలేనని అవినాష్ సీబీఐకి తెలిపాడు. 4 రోజుల పాటు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నాయని, మరోసారి సీబీఐ నోటీసులు ఇస్తే అప్పుడు ఆలోచిస్తా అని అన్నాడు. ఇక ఎంపీ అవినాష్ విజ్ఞప్తి మేరకు సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జనవరి 28న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అవినాష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. దాదాపు 4 గంటలకు పైగా అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) ని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణలో భాగంగా భాగంగా అవినాష్ రెడ్డి (Mp Avinash Reddy) స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు. ఇక అవినాష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డికి, నవీన్ కు సీబీఐ నోటీసులు ఇచ్చి విచారిస్తుంది.

Ap-Ycp: మొన్న ఆనం..నిన్న కోటం..నేడు మేకపాటి..నెల్లూరు వైసీపీకి ఏమైంది?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీలో న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీత దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ వేసింది. ఇక దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని ఆమె పిటీషన్ లో పేర్కొంది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఇటీవల విచారణ జరిపింది. కేసుకు సంబంధించి విచారణపై వివేకా కూతురుకు, భార్యకు అసంతృప్తి ఉందన్న కారణంతో విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది.

ఈ క్రమంలో సీబీఐ అవినాష్ ను విచారించగా తాజాగా సీఎం ఓఎస్డీ, నవీన్ ను విచారిస్తుంది. మరి ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

First published:

Tags: Andhrapradesh, Ap, Ys viveka murder case

ఉత్తమ కథలు