ఏపీ మత్స్యకారులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

ఏపీ సీఎం వైఎస్ జగన్

మత్స్యకార భరోసా పథకంలో భాగంగా దాదాపు 1.09 లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. మత్స్యకారుల డిజీల్ రాయితీ రూ.6 నుంచి రూ.9కి పెంచామని పేర్కొన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తెచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మత్స్యకారుల కష్టాలు అన్నీఇన్నీ కావని, వాటిలో దృష్టిలో పెట్టుకుని మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించామని సీఎం జగన్ చెప్పారు. గతంలో చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.4వేలు ఇచ్చేవారని గుర్తు చేశారు. మత్స్యకార భరోసా పథకంలో భాగంగా దాదాపు 1.09 లక్షల కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. మత్స్యకారుల డిజీల్ రాయితీ రూ.6 నుంచి రూ.9కి పెంచామని పేర్కొన్నారు. మెకనైజ్డ్ బోటుకు నెలకు రూ.3వేల లీటర్లు, మోటారైజ్డ్ బోటుకు నెలకు రూ.300 లీటర్లు అందిస్తున్నట్టు చెప్పారు.

    దీంతో పాటుగా చేపల వేటకు వెళ్లి ఎవరైనా చనిపోతే రూ.10 లక్షలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో రూ.3వేల కోట్లతో ఎనిమిది మేజర్ ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు నిర్మిస్తున్న సంగతిని గుర్తుచేశారు. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులెవరూ గుజరాత్, ఇతర చోట్లకు వలస వెళ్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు.
    Published by:Narsimha Badhini
    First published: