Home /News /andhra-pradesh /

CM JAGAN MOHAN REDDY WILL MEET PRIME MINSTER MODI HE WILL GO DELHI TOMORROW FOR PENDING ISSUES NGS GNT

CM Jagan Delhi tour: రేపు ఢిల్లీకి సీఎం జగన్.. ముందస్తు ఎన్నికలపై క్లారిటీ వచ్చేనా..?

ఢిల్లీకి సీఎం జగన్

ఢిల్లీకి సీఎం జగన్

CM Jagan Delhi tour: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంత సడెన్ గా ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో మీటింగ్ కు కారణం అదేనా..? సీఎం జగన్ పర్యటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి ...
  Anna Raghu, Guntur, News18

  CM Jagan Delhi tour:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పొలిటికల్ హీట్  రోజు రోజుకూ పెరుగుతోంది.  ఎన్నికల ఫైట్ కు అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ హడావుడి మొదలైంది. స్వయంగా టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆ వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామన్నారు. అటు తెలంగాణ (Telangana)లో అదే పరిస్థితి ఉందని ఇటీవల అమిత్ షానే అన్నారు. ఇప్పుడు ఏపీలో అదే హంగామా కనిపిస్తోంది.  ఈ సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బయటకు విభజన సమస్యలు.. పెండింగ్ నిధులపై చర్చించేందుకు సీఎం ఢిల్లీ వెళ్తున్నారని చెబుతున్నా.. అసలు మ్యాటర్ అది కాదంటున్నారు రాజకీయ నిపుణులు...

  ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపై ప్రధాని మోదీ (Prime Minster Modi)  కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ల అభిప్రాయం తెలుసుకోవడానికే వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం  చాలా వర్గాల్లో జగన్ సర్కార్ పై వ్యతిరేకత ఉందని నివేదికలు చెబుతున్నట్టు సమాచారం.  ముఖ్యంగా కాపు సామాజికవర్గం అంతా ఐక్యతా రాగం పాడుతోంది. ఫీఆర్సీ ఫైట్ పీఠముడి వీడకపోవడంతో ఉద్యోగుల్లో కూడా అసహనం పెరుగుతోంది.  ఈ వ్యవహారం ఆలస్యం అయ్యే కొద్దీ నష్ట జరుగుతుందని ప్రభుత్వం ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీతో ప్రస్తుతానికి వివాదాలు ఉన్నా.. సినిమా పెద్దలంతా ఏకమై.. ఇతర పార్టీలకు మద్దతు తెలిపితే జగన్ సర్కార్ కు కష్టాలు తప్పవు. ఇలా అన్నింటినీ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది.

  ఇదీ చదవండి : అధికారుల వేధింపులా..? వ్యక్తిగత కారణాలా..? పోలీస్ క్వార్టర్ట్స్ లో ఆర్ఐ ఆత్మహత్య..

  అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ఇప్పటికే భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.. కానీ అవి కొనసాగాలి అంటే ఆర్థిక వనరులు కావాలి. కానీ కేంద్రం నిధులు ఇవ్వడం లేదు.. అప్పులూ పుట్టడం లేదు. దీంతో ఇంకా ఆలస్యం అయ్యే కొద్ది కష్టాలే తప్ప.. ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీ, అమిత్ షాలతో చర్చించేే అవకాశం ఉందని.. పొలిటికల్ టాక్..

  ఇదీ చదవండి : ఏపీలో అధికారుల స్వామి భక్తిపై విమర్శలు.. మంత్రి కాళ్లు మొక్కిన జేసీ

  ప్రస్తుతం జగన్ సర్కార్ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కేంద్రం నిధులు విడుదల చేయాల్సిందే.. ఎందుకంటే అసలు ఉద్యోగస్తులకు జీతలు ఇవ్వడమే కష్టంగా ఉందని ప్రచారం ఉంది. అదే విషయాన్ని ఇటీవల ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వంతో చర్చల సందర్భంగా స్పష్టం చేశాయి. ఇలాంటి సమయంలో ఎక్కువ కాలం సంక్షేమ పథకాలు అమలు చేయడం కష్టమే.. అదే విషయాన్ని ప్రధాని మోదీ, అమిత్ షాలకు వివరించే అవకాశం ఉంది. దీంతో మరోసారి ఆర్థిక లోటు, రాష్ట్రానికి రావాల్సిన  నిధులు, విభజన హామీలను కూడా మరోసారి ఆయన ప్రధాని మోదీకి గుర్తు చేసే అవకాశం ఉంది.

  ఇదీ చదవండి : ఏపీలో ముందస్తు ఎన్నికలు.. సై అంటున్న ప్రతిపక్షాలు.. సర్కార్ వారి మాటేంటి..?

  సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం జగన్ ఢిల్లీ చేరుకుంటారు.. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని మోదీతో సమావేశం అవ్వనున్నారు.  మోదీతో పాటు.. హోం మంత్రి అమిత్ షాతోనూ.. ఇతర కేంద్ర  మంత్రులతో కూడా సమావేశం కానున్నారు. పోలవరం నిధులు, ఇతర హామీలపై పలు మంత్రులను కలుస్తారు. వీటన్నిటితో పాటు.. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలపై ఈ పర్యటన తరువాత క్లారిటీ వస్తుందని ప్రచారం జరుగుతోంది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Amit Shah, Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Pm modi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు