పోసానికి సీఎం జగన్ బంపర్ ఆఫర్...ఆ పదవి తీసుకోవాలంటూ రాయబారం...

సీఎం జగన్ రాజ్యసభ ఎంపీతో సహా పలు పదవులు ఆఫర్ చేసినప్పటికీ తాను వాటన్నింటినీ తిరస్కరించినట్లు తెలిపారు. అంతేకాదు తాజాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్ రెడ్డి ద్వారా రాయబారం సైతం పంపినట్లు పోసాని స్వయంగా తెలిపారు.

news18-telugu
Updated: January 17, 2020, 11:24 AM IST
పోసానికి సీఎం జగన్ బంపర్ ఆఫర్...ఆ పదవి తీసుకోవాలంటూ రాయబారం...
పోసాని, వైఎస్ జగన్
  • Share this:
పోసాని కృష్ణ మురళి వైసీపీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్న వ్యక్తిగా మీడియాలో పలుమార్లు వార్తలకెక్కారు. పార్టీ పదవులు ఏమీ తీసుకోనప్పటికీ, పోసాని గతంలో టీడీపీ ప్రభుత్వంపై తనదైన మార్కు ప్రెస్ మీట్లతో ప్రజల్లో ఆ పార్టీపై నెగిటివ్ ఇమేజ్ బిల్డ్ చేయడంలో బాగా ఉపయోగపడినట్లు సమాచారం. అయితే పోసాని మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఒక్క పదవి కూడా ఆశించలేదు. సినిమా రంగం నుంచి పెద్దగా వైసీపీకి సపోర్ట్ లేకపోయినప్పటికీ, పృథ్వీ, పోసాని మాత్రం ఆ పార్టీకోసం పనిచేశారు. పోసాని ప్రెస్ మీటింగ్ ల ద్వారా పార్టీకి ఉపయోగపడగా, పృథ్వీ మాత్రం జిల్లాల్లో ప్రచారం చేసి మరీ అధినేత జగన్ దృష్టిలో మంచి మార్కులు కొట్టేశారు. అందుకు ప్రతిఫలంగా పృథ్వీకి ఎస్వీబీసీ చానెల్ చైర్మన్ పదవి సైతం దక్కింది. అయితే పోసాని మాత్రం పదవులకు దూరంగా ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పోసాని తనకు సీఎం జగన్ రాజ్యసభ ఎంపీతో సహా పలు పదవులు ఆఫర్ చేసినప్పటికీ తాను వాటన్నింటినీ తిరస్కరించినట్లు తెలిపారు. అంతేకాదు తాజాగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ చల్లా మధుసూధన్ రెడ్డి ద్వారా తనను ఏదో ఒక పదవి తీసుకోవాల్సిందిగా రాయబారం సైతం పంపినట్లు పోసాని స్వయంగా తెలిపారు. అయినప్పటికీ తాను పదవులకు దూరంగా ఉన్నట్లు పోసాని తెలిపారు.

First published: January 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు