CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ (Visakha) నగరం కీలకపాత్ర పోషిస్తోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) అభిప్రాయపడ్డారు. ఇదే విషయంపై ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు స్వయంగా లేఖలు రాశారు. అలాగే విజయవాడ (Vijaywada), విశాఖ (Visakha), తిరుపతి (Tirupati) విమానాశ్రయాల అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో విస్తరణ అంశాల పై వేర్వేరుగా సీఎం జగన్ లేఖలు రాశారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ నగరం పోషిస్తున్న పాత్రపై క్లియర్ గా వివరించారు. పర్యాటక కేంద్రంగా, పారిశ్రామికంగా ఈ నగరం నుంచి విమానాల రాకపోకలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఉందని లేఖలో గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని విశాఖ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం విశాఖ విమానాశ్రయంలో విస్తరణ, రాకపోకలు పెంచేందుకు భౌగోళిక ఇబ్బందులు ఉన్నాయని ఆయన లేఖలో కోరారు..
రక్షణ శాఖకు కూడా అత్యంత కీలకమైన ఎయిర్ బేస్ ఇది అని, ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్ పోర్టును త్వరితగతిన నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ప్రత్యేకంగా కోరారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణం కోసం సైట్ క్లియరెన్సు అనుమతిని పునరుద్ధరించాలని, ఈ విమానాశ్రయం అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు భాగస్వామిని ఏపీ ప్రభుత్వం గుర్తించిందని ఆయన వెల్లడించారు. ఎన్ఓసీ లేని కారణంగా నిర్మాణ పనులు చేపట్టలేని పరిస్థితి ఉందని, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేసేందుకు తక్షణమే సైట్ క్లియరెన్స్ అనుమతి ఇవ్వాలని ఆయన లేఖలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : పాఠాలు నేర్పమంటే పాడు పనులు.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..?
మరోవైపు ఏపీ రాష్ట్రంలోని కడప నుంచి ఐదు నగరాలకు విమానయాన సంస్థ ఇండిగో విమాన సర్వీసులు (Indigo Flight Services) ప్రారంభం కానున్నాయి. ఈ సేవలు మార్చి 27 నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడ, అలాగే మార్చి 29 నుంచి విశాఖ, బెంగళూరుకు సర్వీలు ప్రారంభించనున్నట్లు ఎయిర్లైన్స్ (Airline) ఒక ప్రకటనలో తెలిపింది. ఇండిగో విమానాల (Flights)తో అనుసంధానించిన వాటిలో దేశంలో73వ నగరంగా కడప నిలవనుందని ఇండిగో తెలిపింది.
ఇదీ చదవండి : అనుమానంతో గోడౌన్ వెళ్లి షాక్ తిన్నపోలీసులు.. గోవా మద్యం విలువ ఎంతో తెలుసా..?
కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత మెల్లమెల్లగా సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. కోవిడ్ నుంచి కోలుకునే సమయంలోనే చమురు ధరలు పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాలతోపాటు విమానయాన సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన లోటును పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.