హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan meet Pm Modi: ప్రధానితో సీఎం జగన్ ఏం చెప్పారంటే..? గంటకు పైగా చర్చ

CM Jagan meet Pm Modi: ప్రధానితో సీఎం జగన్ ఏం చెప్పారంటే..? గంటకు పైగా చర్చ

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)

ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ (ఫైల్)

CM Jagan meet PM Modi: ప్రధాని మోదీతో సుమారు గంట పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చర్చించారు. వీరిద్దరి మధ్య ఏపీకి సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపైనా ఎక్కువసేపు మాట్లాడినట్టు సమాచారం.

ఇంకా చదవండి ...

  CM Jagan meet end Pm Modi:  ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి సుమారు గంట పాటు ప్రధాని మోదీతో చర్చించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితులు.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన  హామీలను ప్రధాని ముందు పూస గుచ్చినట్టు జగన్ వివరించారు. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాల పరిష్కారానికి ప్రధానిని అభ్యర్థించారు.  ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం.. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం ఓడరేవు వంటి అంశాలను వారి వద్ద ప్రస్తావిస్తారని తెలుస్తోంది.. ముఖ్యంగా రాష్ట్ర విభజన పర్యవసనాలు ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బతీశాయని ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించారు. విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం రెవిన్యూ మాత్రమే దక్కిందని గుర్తు చేశారు.

  2015–16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 15,454 రూపాయలు కాగా, ఏపీ తలసరి ఆదాయం 8,979 మాత్రమే అని అన్నారు.

  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదో తెలియచేయడానికి ఈ ఒక్క గణాంకాలే నిదర్శనమన్నారు. భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌ పెద్దది అని, ఇక్కడుండే జనాభా కూడా ఎక్కువ అన్నారు.

  ప్రజల అవసరాలను తీర్చాలంటే, వారికి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం కూడా చేయాల్సి ఉంటుంది అన్నారు. విభజన వల్ల రాజధానిని కూడా ఏపీ కోల్పోయింది అన్నారు. అక్కడ ఏర్పాటు చేసుకున్న మౌలిక సదుపాయాలను కోల్పోయమన్నారు.

  ఇదీ చదవండి : అధికార పార్టీ గూండాలను ప్రోత్సహిస్తోంది.. డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

  రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీతోపాటు అనేక హామీలు ఇచ్చారని ప్రధాని మోదికి మరోసారి సీఎం జగన్ గుర్తు చేశారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుంది అన్నారు. కానీ ఇప్పటి వరకు చాలా హామీలు ఇచ్చినా అవి నెవరేర్చకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.

  ఇదీ చదవండి : బెజవాడలో పాత రోజులు తీసుకురావొద్దు.. పోలీసులకు ఎంపీ వార్నింగ్

  ఇక పోలవరం అంశంపైనా ఎక్కువగా చర్చించినట్టు సమాచారం.

  2013 నాటి భూ సేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగిందన్నారు. ఏప్రిల్‌ 1, 2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో చెప్పిందని.. కానీ 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదన్నారు. అంతే కాకుండా అప్పటివరకూ ఇరిగేషన్‌ కాంపొనెంట్‌ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీని వల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోందన్నారు.

  ఇదీ చదవండి : ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటు..! క్లారిటీ ఇచ్చిన వైఎస్ షర్మిల..

  ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోందన్నారు. 2019–20 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందగించిందన్నారు. దీని వల్ల కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల ఆదాయం తగ్గుతూ వస్తోందన్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్‌ మహమ్మారి కారణంగా పరిస్థితి మరింత దుర్లభంగా మారిందన్నారు. అన్ని వర్గాల వారూ తీవ్రంగా నష్టపోయారన్నారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారని. ప్రపంచంలో ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు విపరీతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు పెట్టబడులు, వారి పెట్టే ఖర్చులు తగ్గాయి. ప్రభుత్వాలే వ్యయం చేయాల్సి వచ్చిందన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Pm modi

  ఉత్తమ కథలు