హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jagan in Kadapa: సంక్షేమంతో పాటే అభివృద్ధి పరుగులు.., కడప టూర్ లో సీఎం జగన్..

Jagan in Kadapa: సంక్షేమంతో పాటే అభివృద్ధి పరుగులు.., కడప టూర్ లో సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) కడప జిల్లా (Kadapa District) లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు వెళ్లిన ఆయన.. గురువారం ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (AP CM YS Jagan) కడప జిల్లా (Kadapa District) లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లాకు వెళ్లిన ఆయన.. గురువారం ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కడప ప్రజలు తనను గుండెల్లో దాచుకున్నారని.. అందుకు ప్రతిఫలంగా తాను అభివృద్ధి చేసి చూపిస్తున్నాను అని ఆయన అన్నారు. ప్రతిసారి తనను ఆశీర్వదిస్తున్న కడప ప్రజలకు తాను రుణపడి ఉంటానన్నారు. పట్టణంలో రూ.515 కోట్లతో 9 అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ప్రొద్దటూరులో 200 కోట్లతో 500 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. 22,212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. అలాగే మొదటి దఫా కింద 10,828 మందికి ఇళ్లు కూడా కేటాయించినట్లు వెల్లడించారు. కోర్టుకు కేసులను ఎదుర్కొంటూ పులివెందులలోనూ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయబోతున్నట్లు జగన్ తెలిపారు.

  రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా.. అభివృద్ధిని కూడా చేసి చూపిస్తున్నామన్నారు. ప్రొద్దుటూరులోతాగునీటి సరఫరా కోసం 119 కోట్లతో నూతన పైప్ లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. అలాగే 163 కోట్లతో నూతన డ్రెయినేజీ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రొద్దటూరు నుంచి ఆర్టీపీపీకి, స్టీల్ ప్లాంట్, హౌసింగ్ కాలనీకి చేరుకునేందుకు పెన్నా నదిపై రూ.53 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మిస్తున్నామన్నారు. రూ.4.5కోట్లతో ఆర్టీసీ బస్ స్టాండ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ.50 కోట్లతో నూతన కూరగాయల మార్కెట్ నిర్మిస్తున్నామన్నారు. యోగివేమన ఇంజనీరింగ్ కాలేజీకి రూ.66 కోట్లు, డిగ్రీ కాలజేకీ రు.24 కోట్లు కేటాయించామన్నారు. అలాగే అనమయ్య ప్రాజెక్ట్ విషాదంలో ఇళ్లు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని సీఎంజగన్ హామీ ఇచ్చారు.

  ఇది చదవండి: ఏపీలో సినిమా థియేటర్ల మూత.. టికెట్ రేట్లపై సెటైర్లు..

  క్రిస్ మస్ వేడుకల కోసం సీఎం జగన్ పులివెందుల వెళ్లనున్నారు. గురువారం ప్రొద్దటూరులో పర్యటన తర్వాత 24వ తేదీ ఉదయం అంటే శుక్రవారం ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ కు చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ తన తండ్రికి నివాళులర్పిస్తారు. ఆ తరువాత పులివెందులకు చేరుకుని ఇండ్రస్ట్రియల్ డెవలప్ మెంట్ పార్క్ లో ఆదిత్య బిర్లాయూనిట్ కు శంకుస్ధాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక శనివారం అంటే క్రిస్మస్ (Christmas) పండుగ సందర్భంగా 25వ తేదీ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గోంటారు. ప్రార్ధనల తరువాత గన్నవరం బయలుదేరి వెళతారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Kadapa

  ఉత్తమ కథలు