మహేష్ బాబుకు సీఎం జగన్ అదిరిపోయే గిఫ్ట్..

Sarileru Neekevvaru | CM Jagan | హీరో మహేష్ బాబు అభిమానులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే గిఫ్ట్ అందించారు.

news18-telugu
Updated: January 9, 2020, 11:48 AM IST
మహేష్ బాబుకు సీఎం జగన్ అదిరిపోయే గిఫ్ట్..
మహేశ్ బాబు, సీఎం జగన్
  • Share this:
హీరో మహేష్ బాబు అభిమానులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే గిఫ్ట్ అందించారు. సంక్రాంతి కానుకగా..మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో జనవరి 11 నుంచి 17 వరకు రెండు షోలు అదనంగా వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఏపీ సర్కారుకు లేఖ రాయగా స్పందించిన సర్కారు శుభవార్త చెప్పింది. ఈ నిర్ణయంతో పండుగ పూట సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు దక్కనున్నాయి.

ఇదిలా ఉండగా, సరిలేరు నీకెవ్వరు సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. మహేష్ బాబు సరసన రష్మిక మందన్నా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు