news18-telugu
Updated: August 6, 2020, 7:17 PM IST
ప్రతీకాత్మక చిత్రం
స్థానిక సంస్థల పాలనపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని మొత్తం 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనని జగన్ సర్కార్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. గత మార్చిలో ఏపీలోని స్థానిక సంస్థలకు ఎన్నికలకు నిర్వహించాలని భావించిన ఏపీ ప్రభుత్వం.. అందుకోసం ఏర్పాట్లు కూడా చేసింది. అయితే ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎన్నికలు వాయిదా వేయడంతో పెద్ద దుమారమే రేగింది.

ఏపీ సీఎం జగన్(ఫైల్ ఫోటో)
జగన్ సర్కార్ ఆయనను పదవి నుంచి తొలగించడం... ఆయన కొన్ని నెలల పాటు న్యాయ పోరాటం చేసి మళ్లీ ఎస్ఈసీ పదవిలోకి రావడం జరిగిపోయాయి. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయం, ఆ తరువాత కరోనా ప్రభావంతో ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఈ ఎన్నికలు ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
Published by:
Kishore Akkaladevi
First published:
August 6, 2020, 7:14 PM IST