Andhrapradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ మేరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సీఎం జగన్ (Cm Jagn) ఆమోదం తెలిపారు. జిల్లాతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం కల్పించగా..అంతర్ జిల్లాల బదిలీల్లో స్పాస్, మ్యూచువల్ బదిలీలకు వీలు కల్పించారు. ఇక జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే రెండేళ్లు పూర్తి అయ్యి ప్రొబేషన్ డిక్లేరైన వాళ్లు బదిలీలకు అర్హులవుతారు. ఈ బదిలీల్లో ఎలాంటి పైరవీలకు తావులేకుండా జరుగుతాయని స్పష్టం చేసింది. బదిలీల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని సీఎం ఆఫీస్ నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.
కాగా ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సర్కార్ ఓకే చెప్పింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీ నిషేధంపై ప్రభుత్వం సడలింపు ఇవ్వగా..రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో బదిలీలకు అవకాశం కల్పించింది. ఏపీ సర్కార్ విడుదల చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ఈనెల 22 నుంచి 31 మధ్య ఉద్యోగుల బదిలీ (Transfers) జరగనుంది. అయితే 2 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న వాళ్లకు రిక్వెస్ట్ పై బదిలీకి అవకాశం కల్పించింది. ఒకేచోట 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికీ రిక్వెస్ట్ పై బదిలీ అవకాశం కల్పించింది. 2023 ఏప్రిల్ నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకున్న వాళ్లు దీనికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే సంక్షేమశాఖ పరిధిలో పని చేసే విద్యాసంస్థల ఉద్యోగులకు బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.
ఇక 2023 ఏప్రిల్ 30 నాటికి 4 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన ప్రభుత్వ ఉద్యోగులంతా బదిలీలకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ, ఎక్సైజ్ శాఖ, రవాణా, వ్యవసాయ శాఖల్లో పని చేసే ఉద్యోగుల బదిలీకి ఆర్ధిక శాఖా అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఏడాది జూన్ 1 నుండి ఉద్యోగుల బదిలీలపై మళ్లీ నిషేధం వర్తించనుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు కూడా ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనితో బదిలీలు జరగనున్నాయి. కాగా సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, Ap cm jagan, Ap grama sachivalayam