Home /News /andhra-pradesh /

CM JAGAN GAVE CHANCE TO AMBATI RAMBABU AND ROJA FOR ATTACK ON TDP CHIEF CHANDRABABU NAIDU NGS

AP Cabinet: కొడాలి పోయే.. రోజా.. రాంబాబు వచ్చే.. ఈ సారి టార్గెట్ చంద్రబాబు వారిదేనా..? ఆ సామాజిక వర్గాన్ని ఎందుకు పక్కన పెట్టారు..? పవన్ ను లైట్ తీసుకున్నారా.?

చంద్రబాబుకు డబుల్ డోస్

చంద్రబాబుకు డబుల్ డోస్

AP Cabinet: ప్రతిపక్ష నేత చంద్రబాబును టార్గెట్ చేయాలి అంటే నిన్నటి వరకు మంత్రి కొడాలి నాని ఉండేవారు. ఇప్పుడు ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించారు.. మరి చంద్రబాబును ఇక కేబినెట్ లో టార్గెట్ చేసేది ఎవరు..? అందుకే చివరి నిమిషంలో రోజాకు ఛాన్స్ ఇచ్చారా? మరో ఫైర్ బ్రాండ్ రాంబాబుని కూడా అందుకే తీసుకున్నారా? ఆ సామాజిక వర్గం నుంచి ఒక్కరిని కూడా ఎందుకు కేబినెట్ లోకి ఎందుకు తీసుకోలేదు.

ఇంకా చదవండి ...
  AP Cabinet: సీఎం జగన్ (CM Jagan) కేబినెట్ లో ఎందరు ఉన్నా..? మొన్నటి వరకు   కొడాలి నాని (Kodali Nani) కి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) .. లోకేష్ (Lokesh) అంటే ఓ రేంజ్ లో విరుచుకుపడతారు.. ఒక్కసారి మైక్ అందుకుంటే ఏం మాట్లాడుతారో తెలియనంతగా మాటల తూటాలు పేలుస్తారు. అయితే చివరి కేబినెట్ తరువాత మాట్లాడిన ఆయన.. మంత్రి పదవి ఉంది కాబట్టి కాస్త నెమ్మదిగా ఉన్నానని.. అదే మంత్రి పదవి పోతే తనను ఎవరూ ఆపలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ బాధ్యత తనపై లేకపోవడంతో ఇక ఆయన ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.. అయితే కేబినెట్ లో కొడాలి నానిని పక్కన పెట్టినా.. ఆయన స్థానంలో ఇద్దరు ఫైర్ బ్రాండ్ లకు సీఎం జగన్ ఛాన్స్ ఇచ్చారు. అందులో ఒకరు నగరి ఎమ్మెల్యే రోజా (Roja) అయితే.. రెండోది సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు (Ambati Rambabu). కేవలం చంద్రబాబు నాయుడు టార్గెట్ గానే ఈ ఇద్దరికీ చివరి నిమిషంలో అవకాశం ఇచ్చారనే ప్రచారం ఉంది. ఒకరికి ఇప్పుడు ఇద్దరు అయ్యారు. మరి విమర్శల స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.. వారిని ఎదుర్కొనేందుకు టీడీపీ సైతం ఎలా సిద్దమవుతుందో చూడాలి..

  కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించడంతో తెలుగు దేశం నేతలు ఓ రకంగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటారు. కానీ ఆ సంతోషం ఉండకుండా చేసేందుకు చివరి నిమిషంలో రోజా, అంబటిలకు అధినేత అవకాశం ఇచ్చారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా ఈ కేబినెట్ కసరత్తు చూసుకుంటే.. 2024 లక్ష్యంగానే తుది కూర్పు చేశారన్నది అర్థం అవుతోందది. అసెంబ్లీలోనూ.. బయట చంద్రబాబుకు కౌంటర్లు ఇవ్వడంతో పాటు.. చిత్తూరు జిల్లాలో చంద్రబాబును ఢీ కొట్టేందుకు పెద్ది రెడ్డితో పాటు రోజా కూడా ఉపయోగపడతారని సీఎం జగన్ భావిస్తున్నారనే ప్రచారం ఉంది.

  ఇదీ చదవండి : దేవుడు వరమిస్తే.. సీఎం కరుణించారు.. చివరి నిమిషంలో తీరిన ఫైర్ బ్రాండ్ చిరకాల కోరిక

  రోజా సుదీర్ఘ కాలం టీడీపీలో పని చేసారు. ఎమ్మెల్యేగానూ అవకాశం దక్కలేదు. 2014లో తొలి సారి ఎమ్మెల్యే అయిన తరువాత టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో టీడీపీ మంత్రులకు రోజా లక్ష్యంగా మారారు. శాసనసభ నుంచి ఏకంగా ఏడాది పాటు రోజా టీడీపీ హయాంలో సస్పెండ్ అయ్యారు. ఇక, ఇప్పుడు అదే శాసనసభలో రోజా మంత్రిగా అడుగు పెట్టనున్నారు. కానీ, చంద్రబాబు వచ్చే ఎన్నికల వరకు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ లేదు. చంద్రబాబును విమర్శించడంలో నాని స్థానాన్ని రోజా, అంబటిలు ఎంత వరకు భర్తీ చేస్తారో చూడాలి.

  ఇదీ చదవండి : బలహీన వర్గాలకు తాయిలాలు కాదు.. రాజ్యాధికారం ఇవ్వడమే లక్ష్యం.. పార్టీలో అలకలపైనా సజ్జల క్లారిటీ

  కేవలం విమర్శల వరకే కాదు.. ఈ సారి కుప్పం నియోజకవర్గం పైన సీఎం జగన్ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పెద్ది రెడ్డి దూకుడుగా వెళ్తున్నారు. ఆయన సోదరుడు కుమారుడు సుధీర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా ప్రచారం సాగుతోంది. ఆయనకు తోడుగా రోజా కూడా రంగంలోకి దిగితే చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచొచ్చని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అన్ని లెక్కలు వేసిన తరువాతే రోజాకు అవకాశం కల్పించారని అంటున్నారు.

  ఇదీ చదవండి : 25 మందితో జగన్ కొత్త కేబినెట్.. ఏ లెక్కన ఎంపిక చేశారంటే.. వారి నేపథ్యం ఇదే..

  గత కేబినెట్ లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని ఉండేవారు.. కానీ ఈ సారి అదే సమాజిక వర్గానికి చెందిన ఒక్కరికి కూడా కేబినెట్ లో అవకాశం ఇవ్వలేదు. మరి ఈ అస్త్రం టీడీపీకి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.. అసలు జగన్ ఎలాంటి వ్యూహంతో ఆ సమాజిక వర్గాన్ని పక్కన పెట్టారన్నది చూడాలి... మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ, ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. పశ్చిమ గోదావరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను కేబినెట్ లోకి తీసుకున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ పైన విరుచుకు పడే మంత్రులు పేర్ని నాని.. కన్నబాబుకు సైతం మంత్రి పదవులు రెన్యువల్ కాలేదు. అంటే పవన్ ను జగన్ లైట్ తీసుకున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Ambati rambabu, Andhra Pradesh, AP News, Chandrababu Naidu, Nagari MLA Roja

  తదుపరి వార్తలు