ఆంధ్రప్రదేశ్ లో పరిపాలకు సంబంధించి కేంద్ర బిందువుగా ఉంటోన్న ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో కీలక మార్పు చోటుచేసుకుంది. ముందస్తుగానే ఎన్నికలకు సమాయత్తం అవుతోన్న సీఎం జగన్ తన ఆఫీసులో ముఖ్యబాధ్యతల నిర్వహణకు సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డిని ఎంచుకున్నారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించీ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా కీలక స్థానాలకు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలివే..
ఆంధ్రప్రదేశ్‌లో 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఇద్దరు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న కేఎస్ జవహర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)కు బదిలీ చేశారు. జగన్ కు ఇష్టుడిగా పేరున్న జవహర్ రెడ్డి సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో సీఎంవోకు బదిలీ అయ్యారు. జవహర్ రెడ్డి బదిలీ తో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగానూ ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలు కేటాయించారు. ధర్మారెడ్డి ప్రస్తుతం ఏఈవోగా ఉన్న సంగతి తెలిసిందే.
నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణను, యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా ఉన్న నాగరాణిని రిలీవ్ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌ను నియమిస్తూ.. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంతియాజ్ గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పని చేశారు.
కాలుష్య కాగా, గతంలో టీటీడీ ఈవోగా పని చేసిన కేఎస్ జవహర్ రెడ్డిని ఇటీవలే ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డిని పూర్తిస్థాయి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. అలాగే ఇప్పటి వరకు అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి పూర్తిస్థాయి ఈవోగా బాధ్యతలు అప్పగించింది.
ఎన్నికలకు సమాయత్తం అవుతోన్న వైసీపీ అధినేత తన ప్రభుత్వంలో అత్యంత కీలకంగా భావించే ఇంటెలిజెన్స్ విభాగంలోనూ గత ఫిబ్రవరిలో మార్పులకు ఆదేశించడం తెలిసిందే. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులును రిలీవ్ చేసి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి అవినీతి నిరోధక శాఖ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Ys jagan, Ysrcp