కొత్త సీఎస్‌గా నీలం సహాని.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

కొత్త సీఎస్‌గా నీలం సహాని.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

నీలం సహాని, వైఎస్ జగన్

ప్రస్తుతం ఏపీ ఇంచార్జి సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్‌ని రిలీవ్ చేసింది.

 • Share this:
  ఏపీ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా మహిళా ఐఏఎస్ అధికారిణి నీలం సహాని నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ ఇంచార్జి సీఎస్‌గా ఉన్న నీరబ్ కుమార్‌ని రిలీవ్ చేసింది. గురువారం ఏపీ తొలి మహిళా సీఎస్‌గా నీలం సహాని బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, నీలం సహాని 1984 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి. రెండు రోజుల క్రితం ఆమె కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి రిలీవ్ అయ్యారు. ఇంతకు ముందు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఆమెకు 2020 జూన్ 30 వరకు ఆమె పదవీ కాలం ఉంది.

  నీలం సహాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. టెక్కలి సబ్ కలెక్టర్, నల్గొండ జిల్లా సంయుక్త కలక్టర్‌‌గా విధులునిర్వహించారు. అంతేకాదు మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీగా, హైదరాబాదులో స్త్రీశిశు సంక్షేమశాఖ పిడిగాను పనిచేశారు. నిజామాబాదు జిల్లా పిడిడిఆర్డిఏ గాను, ఖమ్మం జిల్లాల్లో కాడా(CADA)అడ్మినిస్ట్రేటర్ గాను పనిచేశారు. ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా కలెక్టర్ గాను, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్‌గా, టిఆర్అండ్ బి కార్యదర్శిగా పనిచేశారు. అదే విధంగా క్రీడల శాఖ కమీషనర్ మరియు సాప్ విసి అండ్ ఎండిగాను పని చేశారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం మరియు ఎంవపర్మెంట్ కార్యదర్శిగా పనిచేసిన ఆమె.. నవ్యాంధ్ర తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు

  ప్రభుత్వ జీవో
  Published by:Shiva Kumar Addula
  First published: