CM JAGAN APPOINT A COMMITTEE FOR ON NEW PRC AND EMPLOYEES PROTEST BUT EMPLOYEES SAYS NO DISCUSSIONS NGS
AP Cabinet: ఉద్యోగులను బుజ్జగించేందుకు ప్రత్యేక కమిటీ.. తగ్గదే లే అంటున్న ఉద్యోగ సంఘాలు
ప్రతికాత్మకచిత్రం
Committee on employees Issues: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ప్రభుత్వం వర్సస్ ఉద్యోగులు అన్నట్టుగా మారింది. కొత్త పీఆర్సీ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది.. ఆ పీఆర్సీకి తాము ఒప్పుకోమంటున్నారు ఉద్యోగులు.. తాజాగా ఉద్యోగులను చల్లార్చేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది..
Committee on employees Issues: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పరిస్తితి ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులు అన్నట్టుగా మారింది. పీఆర్సీ (PRC) జీవోలు విడుదల అయినప్పటి నుంచి ఉద్యోగులు ప్రభుత్వం తీరుపై భగ్గుమంటున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులు సమ్మె (Employees Strike) సైరన్ మోగించారు. ఈ నెల ఏడవ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. సోమవారం సీఎస్ సమీర్ శర్మ (CS Sameer Sharma)ను కలిసి నోటీసులు కూడా ఇవ్వనున్నారు. ఏపీ ప్రభుత్వం (AP Government) జీవోలను వెనక్కు తీసుకునే వరకు వెనక్కు తగ్గేదే లే అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమం బాట పట్టిన ఉద్యోగులను బుజ్జగించేందుకు ఐదుగురు సభ్యులతో కమటీ వేసింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) బొత్స సత్యనారాయణ (Botsa satyanarayana), పేర్ని నాని (Perni Nani)తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy), సీఎస్ సమీర్ శర్మ (CS Sameer Sharma) కూడా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి.. సమ్మెనుంచి విరమించేలా చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు..
పీఆర్సీ జీవోకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను బుజ్జగించే పనిలో పడింది. ఇవాళ సచివాలయం వేదికగా సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో.. దీనిపై కీలకంగా చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. రెండున్నర గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరగగా.. ఫిట్మెంట్, పీఆర్సీపైనే ఎక్కువగా దృష్టిసారించినట్టుగా సమాచారం. ఇక, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం ఓ కమిటీని కూడా వేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఓ నిర్ణయానికి రానున్నాయి. ఓవైపు ఉద్యోగులు మళ్లీ సమ్మె బాట పడతామంటే.. ప్రభుత్వం కమిటీ వేసి చర్చలు జరపడానికి సిద్ధం అవుతోంది. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో.. గతంలో ఉన్న ఉద్యోగాల జీతాల కంటే.. ఇప్పుడు తగ్గిపోతున్నాయనే ఆందోళన నెలకొంది. దీనిపై కమిటీ సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమైంది.మరి దీనిపై ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.. ఇప్పటికే సమ్మెనోటీసులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. సోమవారం నోటీసులు ఇచ్చి.. ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. మరి ఇలాంటి సమయంలో చర్చలకు ఉద్యోగ సంఘాలు ఒకే ఆంటాయో లేవో చూడాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.