HOME »NEWS »ANDHRA PRADESH »cm jagan announced that the people of andhra pradesh abroad will come to the state from tomorrow bn

విదేశాల నుంచి ఏపీకి రేపట్నుంచే.. సీఎం జగన్ కీలక నిర్ణయం..

విదేశాల నుంచి ఏపీకి రేపట్నుంచే.. సీఎం జగన్ కీలక నిర్ణయం..
8 జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ పడకలు, ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని అభిప్రాయపడ్డారు. అలాగే కోవిడ్‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి పొందిన గమ్యానికి చేరుకోవడం వరకూ యాప్‌ద్వారా ట్రాక్‌ చేస్తామని, ఆ తర్వాత వారి వివరాలను ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త, అలాగే ప్రతి సచివాలయంలోని హెల్త్‌ అసిస్టెంట్‌కు చేరవేయనున్నారు.

  • Share this:
    విదేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు రేపట్నుంచి రాష్ట్రానికి రానున్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అమెరికా నుంచి వచ్చేవారు వైజాగ్, విజయవాడ, తిరుపతితో పాటు ముంబై, హైదరాబాద్, చెన్నైలాంటి విమానాశ్రయాలకూ చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాల ప్రకారం వీరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉచితంగానే అన్ని వసతులు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయాల నుంచి క్వారంటైన్‌ కేంద్రాలకు చేరడానికి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. లాక్‌డౌన్‌ అనంతరం అనుసరించాల్సిన హెల్త్‌ప్రోటోకాల్‌ అంశంపై సమావేశంలో చాలాసేపు చర్చ జరిగింది.

    రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ తో ప్రారంభమైన కోవిడ్‌–19 నివారణా చర్యల ప్రయాణం.. ఇవ్వాళ దేశంలోనే అత్యధిక పరీక్షలు చేసే స్థాయికి చేరుకున్నామని, చాలా గట్టిగా పనిచేసి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నామని సమావేశంలో చర్చించారు. అయితే లాక్‌డౌన్‌ అనంతరం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి కదలిక ప్రారంభమైతే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎలాంటి ప్రోటోకాల్‌ పాటించాలన్న దానిపైనా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అయితే ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుంచి ఏపీలోకి అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి వైద్య పరీక్షలు చేయాలి?, తర్వాత ఆ వ్యక్తి అనుసరించాల్సిన ఐసోలేషన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఒక ప్రోటోకాల్‌ తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.



    వివిధ రాష్ట్రాల నుంచి 11 చెక్‌పోస్టుల ద్వారా ఏపీలోకి ప్రవేశిస్తారని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి పొందిన గమ్యానికి చేరుకోవడం వరకూ యాప్‌ద్వారా ట్రాక్‌ చేస్తామని, ఆ తర్వాత వారి వివరాలను ఆ గ్రామంలో ఉన్న వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశాకార్యకర్త, అలాగే ప్రతి సచివాలయంలోని హెల్త్‌ అసిస్టెంట్‌కు చేరవేయనున్నారు. హోంక్వారంటైన్‌ పాటించేలా చేయడం, తర్వాత పరీక్షలు చేయించడం తద్వారా వారికి కావాల్సిన వైద్య సదుపాయాలు, అవసరమైన ఆస్పత్రికి తరలించడం వంటి కార్యక్రమాలు కొనసాగేలా చూడాలన్న సీఎం జగన్ పేర్కొన్నారు.

    ప్రజల్లో భయాన్ని పోగొడుతూ భౌతిక దూరం వంటి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, తద్వారా వైరస్‌తో సమర్థవంతంగా పోరాడగలమన్న సీఎం చెప్పారు. అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 7 గంటలకూ దుకాణాలు తెరవాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నందున ఆ మేరకు దుకాణాలు తెరిచేలా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
    Published by:Narsimha Badhini
    First published:May 10, 2020, 17:19 IST

    टॉप स्टोरीज