హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM Jagan: ఆ స్కామ్‌లో చంద్రబాబుకు భారీ ముడుపులు.. అసెంబ్లీలో సీఎం జగన సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

CM Jagan: ఆ స్కామ్‌లో చంద్రబాబుకు భారీ ముడుపులు.. అసెంబ్లీలో సీఎం జగన సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

చంద్రబాబు పై నిప్పులు

చంద్రబాబు పై నిప్పులు

CM Jagan: అసెంబ్లీ వేదికగా మరోసారి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సీఎం జగన్ మోహన్ రెడి.. గత ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని.. అందుకు తగ్గ ఆధారాలు ఉన్నాయని.. సభ్యులకు చదవి వినిపించారు. అమరావతి నిర్మాణం నుంచి టిట్కో ఇళ్ల కేటాయింపు.. స్కిల్ డెవలప్ మెంట్ ఇలా ప్రతి దానిలో చంద్రబాబుకు ముడుపులు అందాయని ఆరోపించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

CM Jagan: ఆంధ్ర్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly) బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Ex CM Chandrababu Naidu)పై సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిప్పులు చెరిగారు. అన్ని రాకాలుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు దోచుకున్నారని మండిపడ్డారు. అమరావతి (Amaravati) ప్రాంతంలో నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల కేటాయింపు, చివరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం నిర్మించే పనుల్లో కూడా  చంద్రబాబు పాలనలో దోపిడీ జరిగిందని ఆరోపించారు. సబ్‌ కాంట్రాక్ట్‌ల పేరుతో బోగస్‌ కంపెనీలకు నిధులు మళ్లించి మరీ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు పాలనలో జరిగిన దోపిడీ ఇన్‌కంట్యాక్స్‌ రైడ్స్‌తో బయట పడిందని, అప్రైజల్‌ రిపోర్టులో షాపూర్‌జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్‌ వాసుదేవ్, చంద్రబాబు ఏపీ శ్రీనివాస్, రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు, మరికొంతమంది కలిసి ఒక పద్ధతి ప్రకారం దొంగల ముఠాగా ఏర్పడి.. దోచుకో, పంచుకో, తినుకో అనే కార్యక్రమంలో భాగస్వాములై ఏరకంగా లూటీ చేశారో ఆధారాలతో సహా దొరికిపోయారని.. వాటి వివరాలు చదివి నిపించారు జగన్..

ఇంకా ఆయన ఏమన్నారంటే..? షాపూర్జీ పల్లోంజి సంస్థకు 8 వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టులు ఇచ్చి 143 కోట్ల రూపాయలు వసూలు చేశారన్నారు సీఎం జగన్‌. పల్లోంజి ప్రతినిధిగా మనోజ్‌ వాసుదేవ్, చంద్రబాబు తరపున ప్రతినిధిగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్.. ఈ ఇద్దరి మధ్యవర్తిత్వంతో డబ్బులు చేతులు మారాయని విమర్శించారు. సీఎం జగన్ .

ఇదీ చదవండి : ఆ ఇద్దరు చరిత్ర హీనులే.. వచ్చే ఎన్నికల్లో టీడీపికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన రోజా

షెల్‌ కంపెనీల ద్వారా ఈ నిధులను మళ్లించినట్లు చెప్పారు. దుబాయ్‌లో చంద్రబాబుకి 15 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. మనోజ్‌, శ్రీనివాస్‌ ఇళ్లలో ఐటీ సోదాల అనంతరం ఇన్విస్టిగేషన్‌ వింగ్‌ అప్రైజల్‌ రిపోర్ట్‌ ఇచ్చిందని, దీని ఆధారంగానే భారీగా డబ్బు చేతులు మారినట్టు గుర్తించారన్నారు సీఎం జగన్. 5 శాతం వసూళ్లు చేసేలా పక్కా ప్లాన్‌ చేశారని కానీ ఇఫ్పుడు ఆదారాలతో సహా దొరికారన్నారు. మొత్తం 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు తెలుస్తోందని, ఇప్పటికే శ్రీనివాస్, మనోజ్‌ను విచారించిన ఐటీ శాఖ.. తాజాగా చంద్రబాబుకు కూడా నోటీసులు పంపిందని వెల్లడించారు సీఎం జగన్.

ఇదీ చదవండి : ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడ.. నేటి అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా.. ఆయన బెంగళూర్ వెళ్లారా..?

ఆఖరికి పవిత్రంగా భావించాల్సిన హైకోర్టు నిర్మాణంలో కూడా డబ్బులు చేతులు మారాయని జగన్ మండిపడ్డారు. దీంతో పాటు సచివాలయం, అసెంబ్లీ, టిడ్కో హౌసింగ్‌ సహా అన్ని నిర్మాణాల్లో దోపిడీకి పాల్పడ్డారని దీనికి సంబంధించి అన్ని వివరాలు ప్రజల్లో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దుబాయిలో కూడా దిర్హామ్స్‌ రూపంలో మనీ చేతులు మారినట్టు తెలిపారు. ఐటీ శాఖ కూడా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ఈ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మొత్తం 27 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలుపగా.. మూడు తీర్మాణాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP Assembly, Ap cm jagan

ఉత్తమ కథలు