Home /News /andhra-pradesh /

CM CHANDRABABU TO VISIT DELHI TODAY

ఢిల్లీలో చంద్రబాబు చేసేదేంటి? ఈ టూర్ అవసరమా?

చంద్రబాబు

చంద్రబాబు

అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ అంశం కాకరేపుతున్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. మరోసారి బీజేపీయేతర శక్తుల్ని ఏకం చేయాలనే ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుంది? అసలు ఢిల్లీలో పార్టీల పెద్దలు చంద్రబాబు టూర్‌పై ఆసక్తి చూపిస్తున్నారా?

ఇంకా చదవండి ...
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలులో జరిగే "జన్మభూమి మా ఊరు" కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి డైరెక్టుగా ఢిల్లీ వెళ్తారు. బీజేపీయేతర పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌పై సీబీఐ కేసు నమోదవ్వడం, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు, ఆయా రాష్ట్రాల్లో అధికారులు, సెలబ్రిటీల ఇళ్లపై సీబీఐ, ఐటీ, ఈడీ సంస్థలతో దాడులు చేయిస్తుండటం, సీబీఐ, ఆర్బీఐని కేంద్రం నీరుగార్చడం, సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలపై చంద్రబాబు ఇవాళ ప్రతిపక్ష నేతలతో చర్చించబోతున్నారు. అలాగే టీడీపీ ఎంపీలతోనూ చంద్రబాబు భేటీ ఉంటుంది.

చంద్రబాబు టూర్‌కి ఒక రోజు ముందు కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశం మొత్తాన్నీ రాజకీయంగా కుదిపేస్తోంది. ఇప్పుడు అన్ని పార్టీలూ అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ పైనే చర్చిస్తున్నాయి. ఇది తప్ప వేరే ఏ అంశాన్నీ టచ్ చెయ్యడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే... ఈ నిర్ణయానికి సంబంధించిన బిల్లును కేంద్రం ఆమోదింపజేసుకుంటే... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలవడం ఖాయం. దీన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీయేతర శక్తులు... కేంద్రం తెస్తున్న బిల్లును ఎలా అడ్డుకోవాలా అని ఎదురుచూస్తున్నాయి. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించే పార్టీలకు ప్రజల నుంచీ వ్యతిరేకత రావడం ఖాయం. అలాగని కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించినా... ఆ పార్టీలకు రాజకీయంగా చావుదెబ్బ తప్పదు. అందువల్ల ఈ బిల్లు విషయంలో ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి బీజేపీయేతర పార్టీలు. ఇలాంటి సమయంలో చంద్రబాబు టూర్‌కి ఆయా పార్టీలు అంతగా ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. చంద్రబాబుతో కూడా ఈ రిజర్వేషన్ల అంశంపైనే చర్చించి... మిగతా విషయాల్ని పక్కనపెట్టాలని పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:


డేట్ ఫిక్స్: ఈ నెల 18న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..


ట్రేడ్ యూనియన్ల 48 గం.ల దేశ వ్యాప్త సమ్మె...స్తంభించనున్న జనజీవనం


స్నేహితుడి చెల్లిని కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ : ప్రాణపాయ స్థితిలో బాధితురాలు

First published:

Tags: Andhra Pradesh, Chandrababu naidu, New Delhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు