CM CHANDRABABU LOKESH ADINARAYANA ROLE IN YS VIVEKANANDA MURDER SAYS YSRCP MP VIJAYASAI REDDY SK
వివేకానంద హత్యలో చంద్రబాబు, లోకేశ్, ఆది నారాయణ హస్తం: విజయసాయిరెడ్డి
విజయసాయిరెడ్డి, చంద్రబాబు
వివేకానంద హత్య కేసులో సుధాకర్ రెడ్డి పైనే వైఎస్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న సుధాకర్ రెడ్డి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇటీవలే ఆయన బయటకొచ్చారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఆదినారాయణ రెడ్డి హస్తముందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సిట్‌పై తమకు నమ్మకం లేదని...సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబాన్ని అంతం చేసేందుకు టీడీపీ కుట్ర చేసిందని.. 1998 నుంచీ వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించారని..ఇంటెలిజెన్స్ అధికారులు ఆయన కోసమే పనిచేస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
వైఎస్ వివేకానంద హత్యలో చంద్రబాబు, లోకేశ్ సూత్రధారులు. మంత్రి ఆదినారాయణ రెడ్డి అమలు చేశారు. నీతి, నిజాయితీ లేని వ్యక్తి ఆదినారయణ రెడ్డి. ఆయన మనిషి కాదు దుర్మార్గుడు. హత్య వెనక కుటుంబ కలహాలు లేవు. నిన్న రాత్రి కూడా వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జమ్మలమడుగులో ప్రచారం తర్వాత వివేకానంద ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను హతమార్చారు. మాకు రాష్ట్ర డీజీపీపైనే నమ్మకం లేదు. ఇక సిట్‌పై నమ్మకం ఎలా ఉంటుంది. పోలీస్ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారు. సీబీఐ విచారణ జరగాలి.
— విజయసాయిరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు
వైఎస్ కుటుంబాన్ని అంతం చేయాలని టీడీపీ కుట్ర చేసింది. 1998 నుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. రాజారెడ్డి హత్యలో టీడీపీ ప్రమేయముంది. ఏపీ అసెంబ్లీలో ఎవరు ఫినిష్ అవుతారో చూడండని చంద్రబాబు అన్నారు. ఆ తర్వాత రెండు రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం జరిగింది. ఇప్పుడేమో వివేకానందరెడ్డిని చంపేశారు.
— విజయసాయిరెడ్డి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు
మరోవైపు వైఎస్ వివకానందరెడ్డి హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. సుధాకర్ రెడ్డి పైనే వైఎస్ కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న సుధాకర్ రెడ్డి జైలు శిక్ష కూడా అనుభవించారు. 3 నెలల క్రితం సత్ప్రవర్తన కారణంగా జైలు నుండి ఆయన బయటకొచ్చారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.