పోలవరంలో వలస కూలీలు, పోలీసులకు మధ్య తోపులాట

పోలవరం దగ్గర పోలీసులకు, వలస కూలీలకు మధ్య తోపులాట

పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పని చేస్తున్న వందలాది మంది కార్మికులు తాము సొంత ప్రాంతాలకు వెళ్లిపోతామని బయలుదేరారు.

  • Share this:
    దేశంలోని అనేక ప్రాంతాలకు చెందిన వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో... వారిని అదుపు చేయడం అధికారులు, పోలీసులకు సవాల్‌గా మారింది. తాజాగా ఏపీలోని పోలవరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర పని చేస్తున్న వందలాది మంది కార్మికులు తాము సొంత ప్రాంతాలకు వెళ్లిపోతామని బయలుదేరారు. అయితే పోలీసులు వారికి రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే కూలీలు మాత్రం తాము వెనక్కి తగ్గేది లేదని... తాము ఎలాగోలా తమ సొంత రాష్ట్రాలకు వెళతామని పట్టుబట్టారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులకు, కూలీలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు త్వరలోనే వారిని స్వస్థలాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో... వలస కూలీలు శాంతించారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు రెండు రైళ్ల ద్వారా వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: