హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

శ్రీవారి సేవలు ప్రముఖులు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కర్ణాటక సీఎంకు స్వాగతం పలికిన వైవీ సుబ్బారెడ్డి

శ్రీవారి సేవలు ప్రముఖులు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కర్ణాటక సీఎంకు స్వాగతం పలికిన వైవీ సుబ్బారెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల (Tirumal) వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy)ని వీఐపీలు దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ దర్శించుకున్నారు. వీరితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్వామివారి సేవలో పాల్గొన్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India

కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ గురువారం రాత్రి తిరుమల చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి స్వాగతం పలికారు.

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి ఆయనకు పుష్ఫగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

తిరుమల శ్రీవారిని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో ముచ్చటించారు.

తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చిన కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైను టీటీడీ చైర్మన్ మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీవారి విగ్రహాన్ని వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకు అందించారు.

తిరుమల శ్రీవారిని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైతో పాటు మాజీ సీఎం యడ్యూరప్ప దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వీరికి స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని అందించారు.

తిరుమల శ్రీవారిని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి వీరికి స్వాగతం పలికి దగ్గరవుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించగా టిటిడి ఉన్నతాధికారులు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం వీరు ఇరువురు తిరుమలలో నిర్మాణ దశలో వున్న కర్ణాటక భవన్‌ను సందర్శించారు.

First published:

Tags: Basavaraj Bommai, NV Ramana, Tirumala, Yediyurappa

ఉత్తమ కథలు