శ్రీకాకుళం జిల్లాలో జోరుగా నాణ్యమైన బియ్యం పంపిణీ

శ్రీకాకుళం జిల్లాలో జోరుగా నాణ్యమైన బియ్యం పంపిణీ

శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల 60 వేల 727 తెల్లరేషన్‌ కార్డులుంటే రెండో రోజు సాయంత్రం నాటికే 9 లక్షల 48 వేల 105 బియ్యం సంచుల్లో, 92 శాతానికిపైగా లబ్దిదారులకు అధికారులు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు ద్వారా అందించారు.

  • Share this:
    రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభించిన నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. నిన్న పలాసలో గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల 60 వేల 727 తెల్లరేషన్‌ కార్డులుంటే రెండో రోజు సాయంత్రం నాటికే 9 లక్షల 48 వేల 105 బియ్యం సంచుల్లో, 92 శాతానికిపైగా లబ్దిదారులకు అధికారులు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు ద్వారా అందించారు. దీనికోసం ఆరువేలకు పైగా వాహనాలను వినియోగించారు. బియ్యం నాణ్యత ఎలా ఉందన్న దానిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. బియ్యం చాలా బాగున్నాయని మంచి ఫీడ్‌ బ్యాక్‌ వస్తోందని మంత్రి శ్రీ కొడాలి నాని అన్నారు. గత నాలుగైదు రోజులగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని అన్ని ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన బియ్యాన్ని రవాణా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా వర్షాలు కారణంగా 30 బియ్యం సంచులుతడిసిపోయాయని వాటి స్ధానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామన్నారు. పేదవాళ్లకు ఇంత మంచి జరుగుతుంటే.. తినగలిగే బియ్యాన్నే పంపిణీ చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతోందని మంత్రి విమర్శించారు.
    First published: