హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీ మాజీ మంత్రి కంపెనీలో ముగిసిన CID రైడ్స్..40 హార్డ్ డిస్కులు స్వాధీనం

ఏపీ మాజీ మంత్రి కంపెనీలో ముగిసిన CID రైడ్స్..40 హార్డ్ డిస్కులు స్వాధీనం

మాజీ మంత్రి నారాయణ

మాజీ మంత్రి నారాయణ

ఏపీ మాజీ మంత్రి నారాయణకు సంబంధించిన కెంపెనీలో సీఐడీ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం ప్రారంభమైన CID సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఇక బుధవారం కూడా సోదాలు జరగగా తాజాగా ముగిసినట్లు తెలుస్తుంది.   రాష్ట్ర రాజధాని అమరావతిలో చట్ట విరుద్దంగా అస్సైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. ఇక నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హోసింగ్ సంస్థలోకి భారీగా నిధులు మళ్లించినట్టు CID అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ డబ్బుతో బినామీ పేర్ల మీద పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఐడీ సోదాలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ సోదాల్లో పలు కీలక డాకుమెంట్స్ సహా 40 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

ఏపీ మాజీ మంత్రి నారాయణకు సంబంధించిన కెంపెనీలో సీఐడీ సోదాలు ముగిశాయి. నిన్న ఉదయం ప్రారంభమైన CID సోదాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఇక బుధవారం కూడా సోదాలు జరగగా తాజాగా ముగిసినట్లు తెలుస్తుంది.   రాష్ట్ర రాజధాని అమరావతిలో చట్ట విరుద్దంగా అస్సైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించి ఈ సోదాలు జరిగాయి. ఇక నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హోసింగ్ సంస్థలోకి భారీగా నిధులు మళ్లించినట్టు CID అనుమానం వ్యక్తం చేస్తుంది. ఈ డబ్బుతో బినామీ పేర్ల మీద పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఐడీ సోదాలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ సోదాల్లో పలు కీలక డాకుమెంట్స్ సహా 40 హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి :  Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఈ నెల 12న మరో జాబ్ మేళా.. రిజిస్ట్రేషన్ లింక్..

అసలు కేసు ఏంటి?

అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనితో CID కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా మాజీ మంత్రి నారాయణలపై CId కేసులు నమోదు చేసింది. చంద్రబాబును A-1గా, నారాయణను A-2గా సీఐడీ చేర్చగా ఫిర్యాదు ఆధారంగా 120బి, 34, 420, 36,37,166 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  కాగా ఆ ఫిర్యాదులో 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్టుగా పేర్కొన్నారు. అంతేకాదు ఆన్ లైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హోసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, LEPL ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది కలిగించారని ఆరోపించారు.

Special Trains: మరో 18 స్పెషల్ ట్రైన్స్... హైదరాబాద్ , తిరుపతి , విజయవాడ , ఇతర రూట్లల్లో ప్రత్యేక రైళ్లు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు నుంచి అనుమతి పొంది అమెరికాలో చికిత్స చేసుకున్నారని నారాయణ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్ లోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు ఇటీవల ఆయన ఇంట్లోనే అధికారులు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఇక ఇప్పుడు సోదాలతో మరోసారి కలకలం రేగింది.

మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకోనున్నాయో చూడాలి.

First published:

Tags: Andhrapradesh, Ap, AP News, Narayana

ఉత్తమ కథలు