హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Breaking: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఇంట్లోనే CID విచారణ..ఆ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు

Breaking: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఇంట్లోనే CID విచారణ..ఆ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ మంత్రి నారాయణ

మాజీ మంత్రి నారాయణ

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో కొంత ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు నుంచి అనుమతి పొంది అమెరికాలో చికిత్స చేసుకున్నారని నారాయణ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్ లోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో కొంత ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసులో సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. కోర్టు నుంచి అనుమతి పొంది అమెరికాలో చికిత్స చేసుకున్నారని నారాయణ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు హైదరాబాద్ లోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను హైకోర్టు ఆదేశించింది.

Flash News: మూడు రాజధానులు..అమరావతి రైతులకు బిగ్ షాక్..పిటీషన్ కొట్టేసిన హైకోర్టు

కాగా అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేర్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనితో CID కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహా మాజీ మంత్రి నారాయణలపై CId కేసులు నమోదు చేసింది. చంద్రబాబును A-1గా, నారాయణను A-2గా సీఐడీ చేర్చగా ఫిర్యాదు ఆధారంగా 120బి, 34, 420, 36,37,166 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  కాగా ఆ ఫిర్యాదులో 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగినట్టుగా పేర్కొన్నారు. అంతేకాదు ఆన్ లైన్ మెంట్ మార్పుతో రామకృష్ణ హోసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, LEPL ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్స్ కు లబ్ది కలిగించారని ఆరోపించారు. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

కాగా 10వ తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ (Narayana)కు కోర్టులో చుక్కెదురైంది.  ఈ కేసుకు సంబంధించి నారాయణ  (Narayana) బెయిల్ ను చిత్తూరు జిల్లా తొమ్మిదో అదనపు కోర్టు రద్దు చేసింది. నవంబర్ 30వ తేదీలోపు కోర్టుకు హాజరుకావాలని నారాయణ (Narayana)ను కోర్టు  (Court) ఆదేశించింది. కాగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణ సమయంలో పలు చోట్ల ప్రశ్నాపత్రాలు లీక్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నా పత్రాల లీక్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో ప్రశ్నాపత్రాలను నారాయణ  (Narayana) విద్యాసంస్థల్లో పని చేసే ఓ ఉపాధ్యాయుడే లీక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎగ్జామ్ మొదలైన గంట సేపు అయిన తరువాత నిందితుడు ప్రశ్న పత్రాన్ని సెల్ ఫోన్ తో ఫోటో తీసి సోషల్ మీడియా (Sociaal media)లో పోస్ట్ చేశాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నారాయణ విద్యాసంస్ధలకు  వ్యవస్థాపకులు నారాయణ (Narayana)ను, అలాగే కొంతమంది సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Ap, Narayana

ఉత్తమ కథలు