టీడీపీకి షాక్... ఆ మాజీ మంత్రులపై సీఐడీ కేసులు నమోదు...

టీడీపీ ఏం జరుగుతుందని మండిపడుతోందో అదే జరుగుతోంది. ఇద్దరు మాజీ మంత్రులపై సీఐడీ కేసు నమోదు చెయ్యడం కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: January 23, 2020, 12:31 PM IST
టీడీపీకి షాక్... ఆ మాజీ మంత్రులపై సీఐడీ కేసులు నమోదు...
టీడీపీకి షాక్... ఆ మాజీ మంత్రులపై సీఐడీ కేసులు నమోదు...
  • Share this:
ఏపీలో రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వైసీపీ ప్రభుత్వ ఆరోపణలతో... ల్యాండ్ పూలింగ్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ విచారణ వేగంగా సాగుతోంది. అందులో భాగంగా... ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులపై సీఐడీ కేసులు నమోదు చేసింది. వారిలో ఒకరు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కాగా... మరొకరు పి.నారాయణ. వీళ్లిద్దరూ... ఎస్సైన్డ్ భూములను కొన్నట్లుగా సీఐడీ చెబుతోంది. రూల్ ప్రకారం ఎస్సైన్డ్ భూములను ప్రభుత్వమే కొన్ని వర్గాలకు ఇస్తుంది కాబట్టి... వారి నుంచీ ఎవరూ వాటిని కొనకూడదు. కానీ వీళ్లు కొన్నట్లుగా సీఐడీ లెక్కలు చెబుతోంది. ఆ క్రమంలో వీళ్లపై కేసులు నమోదు చేసింది. ఐతే... దీనిపై టీడీపీ వర్గాలు ఇంకా స్పందించలేదు.

కేసులు నమోదైనందు వల్ల టీడీపీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ ఇప్పుడు సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. భూములు కొన్నారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ సీఐడీ చెబుతున్నట్లు నిజంగానే అసైన్డ్ లాండ్స్ కొని ఉంటే... వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.

మరోవైపు అమరావతి ప్రాంతంలో తెల్లరేషన్ కార్డులు ఉన్న 796 మంది అడ్డగోలుగా భూములు కొన్నట్లు సీఐడీ చెబుతోంది. వీళ్లందరిపై కేసు నమోదు చేసింది. ఎకరం రూ.3 కోట్ల చొప్పున మొత్తం 761 ఎకరాలు కొన్నారనీ... అలా... మొత్తం 796 మంది వైట్ రేషన్ కార్డు ఉన్నవారు... రూ.300 కోట్లతో భూములు కొన్నారని సీఐడీ గుర్తించింది. వీళ్లతో భూములు ఎవరు కొనిపించారో లెక్కలు రాబడుతోంది.

First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు