ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) బావ, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎష్ షర్మిల (YS Sharmila) భర్త... బ్రదర్ అనిల్ (Brother Anil) పై క్రైస్తవ సంఘాలు సంచలన ఆరోపణలు చేశాయి. సంబంధం లేని సంస్థల్లో తలదూర్చుతున్నారంటూ గుంటూరు జిల్లా (Guntur District) తెనాలికి ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్ సంస్థ ప్రతినిథులు మండిపడ్డారు. పోలీసు కేసులో ముద్దాయిగా ఉన్న లాజరస్ అబ్రహం అనే వ్యక్తిని బ్రదర్ అనిల్ తీసుకువచ్చి ట్రెజరర్ గా నియమించడంపై ఆ సంస్థ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్రదర్ అనిల్ కి సంబంధం లేని చర్చి సంస్థల్లో ఆయన ప్రవేశించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనలపై గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ లోని ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చిలో మత పెద్దలు సమావేశమయ్యారు.
2021 నుంచి బ్రదర్ అనిల్ తమ సంస్థల్లో ఇన్వాల్వ్ అవుతూ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తులను తమ సంస్థలో బాధ్యతలు అప్పగించడంపై బ్రదర్ అనిల్ ను తమ వ్యతిరేకిస్తున్నామన్నారు. సీఎం జగన్ కు స్వయానా బావమరిది అయిన బ్రదర్ అనిల్ నిర్ణయాలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. మొత్తం 43 కేసుల్లో 5 మర్డర్, ల్యాండ్ సెటిల్ మెంట్ కేసులు కలిగిన లుంజాల లాజరస్ అబ్రహం అనే వ్యక్తికి తమ సంస్థలో బాధ్యతలు అప్పగించిన ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ సంస్థకు సంబంధించిన ఆస్తులను కబ్జా చేయడానికి బ్రదర్ అనిల్ యత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
150 ఏళ్ల చరిత్రగల సంస్థ గత పది నెలల నుంచి విపత్కర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. తమ సంఘంలో అసాంఘిక శక్తులు చొరబడి సమస్యలను చిన్నాభిన్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా ఎన్నికైన వారిని కూడా పక్కకునెట్టి బ్రదర్ అనిల్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటనలను అరికట్టాలంటే నూతన పాలక వర్గాన్ని ఏర్పాటు చేసి గాడితప్పిన తమ సంస్థ నిబంధనలను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు మత పెద్దలు వెల్లడించారు.
ఆనవాయితీగా వస్తున్న తమ ఎన్నికల నిబంధనల ప్రకారం మే నెలలో ఎన్నిక జరిగితే మళ్ళీ వచ్చే ఏడాది మే నెల వరకు అతనే అధ్యక్షుడిగా కొనసాగుతారని తెలిపారు. కానీ నీ బ్రదర్ అనిల్ జోక్యంతో ఫిబ్రవరిలోనే ఎలక్షన్ పెట్టినట్లు చెబుతున్నారు. ప్రజాఎన్నిక కాకుండా తమ సొంత ఎన్నిక చేసుకొని తమ సంఘంలోనికి అరాచక శక్తులు చొరబడ్డారు. పోలీసులు, ప్రభుత్వం తమ సంస్థ నిబంధనల గౌరవించి మళ్లీ అదే సంస్థ పెద్దలను అధికారంలో కూర్చోబెడతారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇది చదవండి: ఆయనకు టికెట్ ఇస్తే ఓటమి ఖాయం.. మాజీ మంత్రిపై జేసీ సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో పర్యటించిన ఆయన రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలు, క్రైస్తవులు సుఖంగా లేరని కామెంట్ చేశారు. అంతేకాదు వారికి న్యాయం జరిగేవరకు పోరాడాతానని.. అవసరమైతే రాజకీయ పార్టీ కూడా పెడతానని చెప్పారు. అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో కూడా భేటీ అయి మా సీక్రెట్స్ మాకుంటాయ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో బ్రదర్ అనిల్ ఏపీలో పార్టీ పెట్టబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ఆయనపై ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Guntur