GT Hemanth Kumar, News18, Tirupati
ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వివిధ వెబ్ సైట్స్, యాప్స్ ద్వారా మనకు కావాల్సిన వస్తువులను కొనేస్తున్నాం. వాటిలో వచ్చే ఆఫర్స్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాం. మనకు బాగా గుర్తున్న అమెజాన్ (Aazon), ఫ్లిప్ కార్ట్ (Flipkart) ఈ కామర్స్ సైట్లలో బిగ్ బిలినియన్ సేల్స్., గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వంటి ఆఫర్స్ లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు ఇట్టే తక్కువ ధరకు దక్కించుకుంటున్నాం. కానీ ఆఫర్ల కోసం ఏదోక పండగ సీజన్ కోసం వేచి ఉండాల్సిందే. కానీ అలాంటి అవసరం లేకుండా ఏ వెబ్ సైట్ లో ఏ ఆఫర్స్ ఉన్నాయో చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మీకు కావాల్సిన వస్తువులను అతి తక్కువ ధరకే పొందే అవకాశం మీ ముంగిట ఉంది. అది ఎలా అనుకుంటున్నారా.?
ఈ-కామర్స్ సైట్లు అందించే ఆఫర్లను ఇట్టే తెలుసుకునేందుకు చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన హరికిరణ్ రూపొందించాడు. Techglaredeals.com పేరుతో రూపొందించిన వెబ్ సైట్ లో ఆన్ లైన్ సేల్స్ కి సంబందించిన ఆఫర్లను సులువుగా మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న లింక్ ద్వారా మీకు కావాల్సిన వస్తువులను సరసమైన ధరలకు పొందవచ్చు. డిస్కౌంట్., కూపన్స్ ఏడాది పొడవునా అందిస్తాం అంటున్నారు ఈ వెబ్ సైట్ ను రూపొందించిన రూపకర్త... హరికిరణ్.
చిన్ననాటి నుంచి గాడ్జెట్స్., ఎలక్ట్రానిక్ వస్తువులంటే.... చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన హరికిరణ్ కు ఎంతో ఇష్టం. బిటెక్ చదివిన ఇతను 2016లో టెక్నాలజీ రివ్యూస్., ఎలక్ట్రానిక్ గాడ్జెట్ రివ్యూస్ కోసం ఓ వెబ్ సైట్ ప్రారంభించాడు. ఈ వెబ్ సైట్ లో వివిధరకాల రివ్యూస్ రాసిన సరైన ఆదరణ లేదు. తాను ఓ మొబైల్ కొనడానికి వెబ్ సైట్లు వెతికాడు. చాల వెబ్ సైట్లలో ఆఫర్స్ లేకపోగా.... మొత్తం యాడ్స్ మాత్రమే దర్శనమిచ్చాయి. దింతో హరికిరణ్ కు నయా ఆలోచన వచ్చింది 2018లో పెద్దగా డీల్ పై ఆదరణ లేదు... కానీ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకొని వెబ్ సైట్ ను ప్రారంభించాడు. అనేక వెబ్ సైట్లలో వచ్చే డీల్స్ ను తన వెబ్ సైట్ లో పెట్టడం ప్రారంభించాడు. ఆరంభంలో రోజుకు వందల సంఖ్యలో హిట్స్ వచ్చేవి. ఒక్క డీల్ వెబ్ సైట్ హిట్స్ పై తీవ్ర ప్రభావం చూపింది. ఒక్క టిబి హార్డ్ డిస్క్ కేవలం రూ. 499కి లభిస్తుందన్న డీల్ తో భారీ హిట్స్ రావడం ప్రారంభం అయింది. దింతో అతను ప్రారంభించిన వెబ్ సైట్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.
టెక్ గ్లేర్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి.... అదెలా సాధ్యం అయింది..?
అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా సహా పలు ఈ-కామర్స్ సంస్థలు అందించే అన్నిరకాల ఆఫర్లు, రాయితీలు, క్యాష్ బ్యాక్ లు, కూపన్ల వివరాలు ముందే హరికి పంపిస్తారు. వీటిని తన వెబ్సైట్లో ఉంచుతాడు. ఆ లింక్ ద్వారా ఎవరైనా ఉత్పత్తులు కొనుగోలు చేస్తే తనకి కొంత కమిషన్ అందుతుంది. సంస్థల వెబ్సైట్, యాప్లోనే అన్ని ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు అందుబాటులో ఉంచుతారు. మీడియాలో ప్రచారం చేస్తారు. అయినా ఇతర వెబ్సైట్లలో వినియోగదారులకు లాభం చేకూర్చేలా ప్రత్యేకంగా, అదనంగా ఏమైనా రాయితీలు ఉంటాయా? అనే సందేహం రాకమానదు ఎవరికైనా.
ప్రతి ఈ-కామర్స్ సంస్థకి అత్యధిక అమ్మకాలే లక్ష్యం. తమ ప్రయత్నాలు చేస్తూనే ఎక్కువ వెబైసైట్ వీక్షకులు, సామాజిక మాధ్యమాల్లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్నవారిని ఆకట్టుకునేలా ఆదరణను అమ్మకాలుగా మలుచుకునేలా భాగస్వామ్యం కుదుర్చుకుంటారు. ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఈ అఫిలియేట్ వెబ్ సైట్ నిర్వాహకులను ప్రోత్సహిస్తారు. హరి వెబ్ సైట్ తో పాటు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేస్తుంటాడు. కేవలం సంపాదన ఒక్కటే కాదు.. జనానికి ఉపయోగపడేలా గ్యాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్ల రివ్యూలు, సలహాలు అందుబాటులో ఉంచుతున్నాడు. విద్యార్థుల కోసం ఉచిత ఆన్లైన్ కోర్సులు పోస్ట్ చేస్తున్నాడు.
'వెబ్ సైట్ ప్రారంభించి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై రివ్యూ రాస్తూ వచ్చాను. కానీ అది అంతగా క్లిక్ కాలేదు. మొబైల్ కొనడానికి ఓ వెబ్ సైట్ లో యాడ్స్ చూసాను... అదులో విపరీతమైన యాడ్స్ వచ్చాయి. డీల్స్ మాత్రం కనపడలేదు. దింతో నేనే ఓ వెబ్ సైట్ ప్రారంభించాలి అని సంకల్పించాను. ఆలా techglaredeals.com ప్రారంభించాను. మొదట్లో పెద్దగా ఆదరణ రాలేదు. ఒక్క డీల్ తో వెబ్ సైట్ కు హిట్స్ భారీ స్థాయిలో రావడం జరిగింది. అప్పటినుంచి రోజుకు 50 వేలకు పైగా హిట్స్ వస్తున్నాయి. నాతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించడం చాల ఆనందంగా ఉంది.' అని న్యూస్18 తో చెప్పారు హరికిరణ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, E-commerce