(G.T.Hemant Kumar,News18,Tirupati)
ప్రస్తుత సమాజంలో అక్రమ సంబంధాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంట్లో జరిగే గొడవల నుంచి.... చిన్న చిన్న కారణాల వల్ల వివాహేతర సంభంధం పెట్టుకుంటూన్నారు. ఇది వరకు వివాహిత భర్తను, లేదా భార్యనో హతమార్చే వారు. కానీ ఉమ్మడి చిత్తూరు(Chittoor)జిల్లాలో మాత్రం తమ్ముడి అక్రమ సంబంధానికి అన్న బలైయ్యాడు. తముడి ప్రాణాలు కాపాడేందుకు రాజీ కుదర్చుకుందామని యువతి తరపు బంధువులు వేసిన మర్డర్ స్కెచ్ ఊహించలేకపోయాడు. అర్ధరాత్రి బ్రతికుండగానే సజీవసహనం అయిన సంఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి (Chandragiri)నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. ఈమొత్తం వ్యవహారంలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ తరపు బంధువులు..హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. మృతుడు నాగరాజు (Nagaraju)భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదు చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈమర్డర్ ఎపిసోడ్(Murder episode)లో ఓ గ్రామసర్పంచ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండటంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది.
చిచ్చు రాజేసిన వివాహేతర సంబంధం..
తాత్కాలిక సంబంధాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. అత్యంత క్రూరంగా, మానవత్వం మరిచిపోయి ..రక్షసంగా బ్రతికున్న ఓ వ్యక్తిని కారులో పెట్టి నిప్పంటించడం ఇప్పుచు కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం బ్రాహ్మణపల్లెలో నాగరాజు అనే వ్యక్తి శనివారం రాత్రి కారులో ఉండగానే మంటల్లో కాలి సజీవ దహనం అయ్యాడు. మృతుడు నాగరాజు అతని సోదరుడు పురుషోత్తం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌లుగా జాబ్ చేస్తున్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో స్వగ్రామంలో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మృతుడు నాగరాజు తమ్ముడు పురుషోత్తం అదే గ్రామానికి చెందిన సర్పంచ్ చాణక్య మరదలితో వివాహేతర సంభంధం పెట్టుకున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా కొంతలంగా సాగుతున్న వివాహేతర సంభంధం ఈ ఏడాది శివరాత్రి నాడు బట్టబయలు అయింది. పురుషోత్తం సర్పంచ్ మరదలు ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రత్యక్షంగా పట్టుకున్నారు. అప్పుడే ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
A #SoftwareEngineer Nagaraju was allegedly #BurntAlive in his car by unidentified persons near Gangudupalle vill in #Chandragiri mandal of #Tirupati dist. Police suspect he was murdered last night and the accused tried to make it appear like an accident.#AndhraPradesh #CarFire pic.twitter.com/9kxSGwHu9C
— Surya Reddy (@jsuryareddy) April 2, 2023
తమ్ముడిపై పగతో అన్నను చంపారు..
ఊళ్లో ఉంటే తన తమ్ముడి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని నాగరాజు పురుషోత్తంను బెంగుళూరు పంపాడు.ఈ వివాహేతర సంబంధంపై ఇరువర్గాల మధ్య పంచాయితీ నడుస్తూ ఉండగానే సర్పంచ్ చాణక్య నాగరాజుతో పాటుగా అతని తమ్ముడిని సైతం పంచాయితికి తీసుకురావాలని డిమాండ్ చేసాడు. అయినా నాగరాజు శనివారం తాను మాత్రమే పంచాయితీకి వెళ్ళాడు. ఒక్కడే పంచాయితీ వెళ్లడమే అతనికి శాపంగా మారింది. గ్రామ సర్పంచ్ చాణిక్య.. నాగరాజుతో మాట్లాడాలని పిలిపించాడు. ఈ క్రమంలోనే మాటల సందర్భంగా ఆగ్రహంతో సర్పంచ్ చాణిక్య నాగరాజుపై దాడికి దిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడి అనంతరం కారులో నాగరాజును ఉంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించి ఉంటారని ప్రధమనిక నిర్ధారణకు వచ్చారు. ఘటన అనంతరం సర్పంచ్ చాణిక్య పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.
హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ..
తిరుపతి నుంచి స్వగ్రామమైన బ్రాహ్మణ పల్లెకు వెళ్తుండగా గంగుడుపల్లె దగ్గర ఆయన కారు మంటల్లో కాలి బూడిదైందన్నా సమాచారంతో పోలీసులు రంగప్రవేశం చేసారు. నాగరాజు ఆ కారులోనే సజీవ దహనం అయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వస్తువులు, కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడు నాగరాజుగా గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సాయంతో విచారణ కొనసాగుతోంది.నాగరాజు భార్య సులోచన, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్రాహ్మణపల్లికి చెందిన రూపంజయ, సర్పంచ్ చాణక్యతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. రూపంజయను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని, పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని సీఐ ఓబులేశు తెలిపారు. తన భర్త నాగరాజును చంపిన వారిని కఠినంగా శిక్షించాలని సులోచన డిమాండ్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.