Home /News /andhra-pradesh /

CHITTOOR ROAD ACCIDENT LORRY HITS MINI VAN THREE PEOPLE KILLED SU

Chittoor Road Accident: శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, మినీ వ్యాన్ ఢీకొన్నఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

    ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, మినీ వ్యాన్ ఢీకొన్నఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ బాలికతో పాటు ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు. వివరాలు.. కర్ణాటక రాష్ట్రం నంగిలికి చెందిన పి విజయ్‌కుమార్, అతడి తమ్ముడు శేఖర్ కుటుంబాలు శక్రవారం తిరుపతిలోని పలు ఆలయాల సందర్శనకు బయలుదేరారు. వారితో పాటు వాళ్లు నివాసం ఉంటున్న ఇంటి యజమాని సుబ్రహ్మణ్యం రాజు కుటుంబం ఉంది. మొత్తం 10 మంది రెండు వాహనాల్లో తిరుమలకు వచ్చారు. దర్శనం అనంతరం నంగిలికి తిరుగు పయనమయ్యారు. అయితే వారు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ను గాదంకి సమీపాన చిత్తూరు నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీ కొట్టింది. లారీ బలంగా ఢీ కొట్టడంతో ఆ ధాటికి వ్యాన్ ఒక్కసారిగా అడ్డం తిరిగిపోయింది.

    శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం వినిపించడంతో పరిసర ప్రాంతాల వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక, ఈ ప్రమాదంలో ముందు సీట్లో ఉన్న విజయకుమార్ భార్య అన్నపూర్ణ(60), ఆయన తల్ల రాజమ్మ(80),వెనక కూర్చున్న జ్యోతి(14) అక్కడికక్కడే మృతిచెందారు.

    ఇంకా ఈ ప్రమాదంలో మరో  ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, Chittoor, Road Accident

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు