(G.T.Hemant Kumar,News18,Tirupati)
ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి(Srivenkateswara Swamy)ని దర్శించుకునేందుకు...మొక్కులు చెల్లించుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ..విదేశాల నుంచి భారీ స్థాయిలో భక్తులు భక్తులు తిరుమల(Tirumala)కు వస్తుంటారు. తిరుమలకి వచ్చే భక్తులు తమ కానుకలు శ్రీవారి ఆలయంలోని హుండీ(Hundi)లో వేస్తారు. ఒక్కో భక్తుడు తమ స్థాయికి తగ్గట్లుగా బంగారు., వెండి., నగదు, విదేశీ కరెన్సీని హండీలో సమర్పిస్తారు. స్వామి వారి హుండీలో వేసే కానుకలు ఏ భక్తుడు ఎంత వేస్తాడో ఎవరికీ తెలియదు. అలానే దూర ప్రాంతాల్లో నివసించే భక్తులు శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించాలని అనుకుంటూ ఉన్నవారికి ఈ-హుండీ ఓ వరంగా మారింది.
దేవదేవుని ఆదాయంపై జరిమానా..
ఈ-హుండి టీటీడీ అధికారిక వెబ్ సైట్., టీటీడీ యాప్ లో అందుబాటులో ఉంటుంది. ఈ-హుండీలో రూ.1 నుంచి మనకు తోచిన స్థాయిలో నగదు బదిలీ చేయవచ్చు. ఇలా స్వదేశీ., విదేశీ కరెన్సీలను ఎంతైనా పంపవచ్చు. వివిధ దేశాల కరెన్సీలను ఈ-హుండీకి నేరుగా బదిలీ చేస్తారు. వారి వివరాలు ఎక్కడ టీటీడీకి తెలియజేయరు భక్తులు. ఒక్క అకౌంట్ వివరాలు తప్పా మరేవివరాలు అందులో ఉండవు. ఈ-హుండీ ద్వారా రూ. 26 కోట్ల రూపాయలు పంపారు భక్తులు. ఈ-హుండీలో యుఎస్ డాలర్లు భారత దేశ కరెన్సీలో 11.50 కోట్లు, మలేషియా రింగిట్స్ రూ.5.93 కోట్లు, సింగపూర్ డాలర్లు రూ.4.06 కోట్లు కూడా ఉండగా...ఆ మొత్తాన్ని స్టేట్ బ్యాంకు టీటీడీ ఖాతాలో జమ చేయకుండా మూడు సంవత్సరాలుగా వరకూ కాలం పొడిగిస్తూ వచ్చింది.
భక్తుల కానుకలపై కూడా ఫైన్..
అయితే ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని టిటిడి కేంద్ర ప్రభుత్వంకు లేఖ ద్వారా విన్నవించింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీకి 2019కి గానూ 1.14 కోట్ల రూపాయలు అపరాధ రుసుము విధించింది. మళ్లీ ఈ ఏడాది మార్చి 5 న కేంద్ర ఎఫ్.సి.ఆర్.ఎ విభాగం వార్షిక రిటర్న్‌ల్లో హుండీలో కానుకలు వేసిన వారి చిరునామాలు లేవని, టీటీడీ ఉన్నత అధికారులకు లేఖ రాస్తూ మళ్లీ రూ. 3.19 కోట్ల జరిమానా విధించింది. ఇలా రెండు సార్లు అపరాధం విధించిన మొత్తం 4.31 కోట్ల రూపాయలు.
सबसे पवित्र तिरुमाला तिरुपति देवस्थानम (TTD) जहां हर दिन लाखों भारतीय तीर्थयात्री जाते हैं, उसे मोदी सरकार नोटिस भेजती है और 3 करोड़ रुपए का जुर्माना लगाती है, जबकि अडानी को बचा लिया जाता है। मोदानी है तो मुमकिन है! https://t.co/d16Y0RXOpo
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 27, 2023
టీటీడీ వాదనను పట్టించుకోని కేంద్రం..
అంతే కాకుండా టిటిడికి రాసిన లేఖలో ఏపి దేవాదాయ శాఖను సైతం తప్పులను ఎత్తు చూపుతూ టిటిడికి లేఖను పంపింది. అయితే చాలా వరకూ ఈ హుండీ ద్వారా నగదును పంపిన భక్తుల వివరాలను టిటిడి ఆర్బిఐకి పంపలేక పోయింది. ఇదే అంశంను సైతం టిటిడి లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వంకు తెలియజేయగా, ఇదే విషయంపై న్యాయం కోసం ఫిటీషన్లు దాఖలు చేయడం జరిగింది. హుండీలో వేసిన కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానం కార్పస్‌లో భాగమేనని ఏపీసీహెచ్‌ఆర్ చట్టంలోని సెక్షన్ 111 పేర్కొన్నట్లు టీటీడీ తన వాదనలను వినిపించింది. అందుకే తాము తమ రిటర్న్ లలో విదేశాల నుంచి వచ్చిన ఈ-హుండీ కానుకలను కూడా చూపించినట్టు తెలియపరిచింది.
మూడేళ్లుగా ఇదే తంతు..
అయితే ఎస్.బి.ఐ టీటీడీకి చెల్లించకుండా పక్కన పెట్టిన 26 కోట్లకు వడ్డీ కూడా చెల్లించక పోవటం ఒక వైపు ఉంటే, దానిపైన టీటీడీ కేంద్రానికి విన్నపాలు పంపినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవటం మరోవైపు ఉంది. మొత్తంపైన కేంద్రం తెలిపిన విధంగా వివరాలు సేకరించి, టీటీడీ మళ్లీ గత మార్చి26న రిటర్నులు దాఖలు చేసింది. అయినప్పటికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా రూ. 3.19 కోట్ల తాజా జరిమానాను టీటీడీకి విధించింది.. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ కీలక నేత జయరాం రమేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ధార్మిక సంస్ధకు కొంత మినహాయింపు ఇవ్వాలంటూ టిటిడి ఆర్బిఐ ని పలుమార్లు కోరింది. అయితే టిటిడి విన్నపంను ఆర్బిఐ తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల అపరాధ రుసుమును టిటిడి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. అయితే 2018వ సంవత్సరంలో ముగిసిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వం రెన్యూవల్ చేయనున్నట్లు తెలుస్తొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Central Government, Rbi, Tirumala, Ttd news