CM Jagan Tirumala Tour: చిత్తూరు జిల్లాలో హైఅలర్ట్... కాసేపట్లో తిరుమలకు సీఎం జగన్...

AP CM Jagan Tirumala Tour: బ్రహ్మోత్సవాల్లో భాగంగా... ఏపీ సీఎం జగన్ తిరుమల శ్రీవారి సందర్శనకు వస్తుండగా... డిక్లరేషన్ వివాదం ముదురుతోంది. ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

news18-telugu
Updated: September 23, 2020, 12:41 PM IST
CM Jagan Tirumala Tour: చిత్తూరు జిల్లాలో హైఅలర్ట్... కాసేపట్లో తిరుమలకు సీఎం జగన్...
వైఎస్ జగన్, తిరుమల బ్రహ్మోత్సవం
  • Share this:
AP CM Jagan Tirumala Tour: తిరుమలలో డిక్లరేషన్ వివాదం రచ్చ రేపుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుండటంతో... డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని ప్రతిపక్ష బీజేపీ, టీడీపీ శ్రేణులు చిత్తూరు జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. ముందుగానే భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు... ఆయా పార్టీల నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు. అటు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ దగ్గరున్న సీఎం జగన్ ఇంటి దగ్గర బీజేపీ, భజరంగ్ దళ్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో... ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ నుంచి బయల్దేరిన సీఎం జగన్... కాసేపట్లో రేణిగుంట ఎయిర్ పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుంటారు. పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. సాయంత్రం 5.27కి అన్నమయ్య భవన్ నుంచి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. సాయంత్రం 6.15కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.30కి శ్రీవారి గరుడ సేవలో సీఎం జగన్ పాల్గొంటారు. సీఎం జగన్... సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించాలనీ, డిక్లరేషన్ ఇవ్వాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

24న (గురువారం) ఉదయం 6.15 గంటలకు శ్రీవారిని మరోసారి దర్శించుకుంటారు సీఎం జగన్. 24న ఉదయం 7 నుంచి 8 వరకు సుందరకాండ పఠనంలో పాల్గొంటారు. ఆ తర్వాత 8.10కి కర్ణాటక చౌల్ట్రీ శంకుస్థాపన కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. 24న రాత్రి 10.20కి రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరతారు సీఎం జగన్.

శ్రీవారి దర్శనానికి వచ్చే జగన్... అన్య మతస్థులు సంతకం చేసే... డిక్లరేషన్‌పై సంతకం చెయ్యాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇదివరకు జగన్ తిరుమలకు వెళ్లినప్పుడు సంతకం చెయ్యలేదనీ... మరి ఇప్పుడెందుకు దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. దేశంలో మరే ఆలయానికీ లేని ఈ రూల్... తిరుమలకు ఎందుకని ప్రశ్నించారు మంత్రి కొడాలి నాని. దీనిపై బీజేపీ భగ్గుమంటోంది. తిరుమలలో ఉన్న సంప్రదాయాల్ని వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందనీ... దీన్ని సహించే ప్రసక్తే లేదని అంటోంది. "ఇప్పుడు డిక్లరేషన్ ఎవరు తెచ్చారని అంటున్నారు. రేపు పూజలు, నైవేద్యాలు ఎవరు తెచ్చారని కూడా అంటారు. ఎవరైనా సరే సంప్రదాయాన్ని పాటించాల్సిందే" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.

అసలే ఏపీలో హిందూ మత విగ్రహాల ధ్వంసం, తగలబెట్టడం వంటి ఘటనలు ఈమధ్య ఎక్కువయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో... డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. ఏపీ సీఎం జగన్... 6 కోట్ల మందికి ప్రతినిధిగా తిరుమల వెళ్తున్నారు కాబట్టి... తిరుమల శ్రీవారిపై నమ్మకం ఉంది అని డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వ వర్గాల వాదన. అన్య మతస్థులు ఎవరైనా సరే... తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడు... తప్పని సరిగా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సిందే అంటోంది బీజేపీ. అందువల్ల సీఎం జగన్ టూర్ లో ఏం జరుగుతుందన్నదానిపై టెన్షన్ వాతావరణం ఉంది.
Published by: Krishna Kumar N
First published: September 23, 2020, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading