హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి భారీగా బంగారం.. నగదు డిపాజిట్లు.. విలువ ఎంతో తెలుసా?

Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారికి భారీగా బంగారం.. నగదు డిపాజిట్లు.. విలువ ఎంతో తెలుసా?

కాణిపాకం ఆలయం లెక్కలు ఇవే

కాణిపాకం ఆలయం లెక్కలు ఇవే

Kanipakam: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆస్తుల గురించి ఎప్పుడైనా విన్నారా..? ఆలయానికి బంగారం.. నగదు డిపాజిట్లు భారీగానే వస్తాయని తెలుసా..? తొలిసారి ఆలయ అధికారులు వాటి విలువ బయటపెట్టారు.. ఎంతో తెలుసా?

  • News18 Telugu
  • Last Updated :
  • Chittoor, India

 GT Hemanth Kumar, Tirupathi, News18

మన రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలు (Famous Temple).. పుణ్య క్షేత్రాలు  చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో కాణిపాకం (Kanipakam) ఆలయం ఒకటి.. ఆలయం మాస్టర్ ప్లాన్ లో భాగంగా 80 కోట్లతో అభివృద్ధి పనులు ,వివిధ బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్  (Fixed Deposite) లో ఉన్న డబ్బులు బంగారం (Gold) వెండి (Silver) వివరాలను తాజాగా  వెల్లడించారు ఆలయ ఈవో వెంకటేష్.. ఆలయ అభివృద్ధి పనులకు మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కోసం ద్రోణ కన్సల్టెన్సీ తో అగ్రిమెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి (Chairman Mohan Reddy).. చిత్తూరు జిల్లా (Chittoor District) ప్రముఖ పుణ్యక్షేత్రం కానిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కు వచ్చే సామాన్య భక్తులకు స్వామివారి సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఆ విధంగా ఆలయ పాలకమండలి అధికారులు కృషి చేస్తున్నారని కాణిపాకం పాలకమండలి చైర్మన్ అగరం మోహన్ రెడ్డి అన్నారు.

శుక్రవారం కాణిపాకం ఆలయ పాలకమండలి సమావేశం చైర్మన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ ఈవో వెంకటేష్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో భాగంగా సుమారు 80 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు, డార్మెటరీ, అన్నదాన విస్తరణకు  ,సంబంధించి అదనపు భవనం, నూతనంగా బస్టాండు ఏర్పాటు తోపాటు భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఉద్యానవనాలు, ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఈవో వెంకటేష్ మాట్లాడుతూ కాణిపాకం ఆలయంలో ఉన్న బంగారు వెండి ఇతర డిపాజిట్లు ప్రజలకు పారదర్శకంగా ఉండేందుకు లెక్కలు  తయారు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మార్చి నుంచి పూర్తి స్థాయి ఫ్యామిలీ డాక్టర్.. పూర్తి ప్రయోజనాలు ఇవే..

వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో 144, కోట్ల 87 లక్షల  5  వేల  700 రూపాయలు...  బంగారం 17  కేజీల 680 గ్రాములు. వెండి 1,021 కేజీల  7o8 గ్రాములు. బ్యాంకు సేవింగ్ అకౌంట్లో 18 కోట్ల 68 లక్షల 39 వేల రూపాయలు. గో సంరక్షణ నిధికి 21 లక్షల 3 వేల 601  రూపాయి.. నిత్య అన్నదాన ట్రస్టు ఎస్ బి లో 2  కోట్ల 93  లక్షల 42  వేల 278 రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి : యువగళంతో లోకేష్ సీఎం అవుతారా..? పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఉండేందుకు ఆలయానికి సంబంధించిన నిధులను వెల్లడించను జరిగిందని  అధికారులు వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Chittoor, Hindu Temples

ఉత్తమ కథలు