హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan Chiranjeevi: ఎవరేమన్నా ఆ విషయంలో చిరంజీవికే ప్రాధాన్యత.. సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారా ?

YS Jagan Chiranjeevi: ఎవరేమన్నా ఆ విషయంలో చిరంజీవికే ప్రాధాన్యత.. సీఎం జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారా ?

సినిమా ఇండస్ట్రీకి ఏపీలో కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. వాటి నుంచి బయట పడటానికి దర్శక నిర్మాతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే హీరోలు కూడా తమ వంతు ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై బయటికి వచ్చి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ స్థితిగతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గత నెల 14న వివరించాడు మెగాస్టార్.

సినిమా ఇండస్ట్రీకి ఏపీలో కొన్ని రోజులుగా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. వాటి నుంచి బయట పడటానికి దర్శక నిర్మాతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే హీరోలు కూడా తమ వంతు ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై బయటికి వచ్చి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ స్థితిగతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గత నెల 14న వివరించాడు మెగాస్టార్.

Tollywood News: తాను టాలీవుడ్ పెద్దను కాదని చిరంజీవి స్వయంగా ప్రకటించడం.. ఆ వెంటనే నటుడు మోహన్ బాబు దీనికి కౌంటర్ ఇచ్చే విధంగా కామెంట్లు చేయడం ఆసక్తి రేకెత్తించాయి.

  ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఈ భేటీ అనంతరం చిరంజీవి చేసిన వ్యాఖ్యలతో ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభించబోతోందనే సంతృప్తి సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారానికి ఏదో రకంగా ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతోనే సీఎం జగన్, చిరంజీవి మధ్య సమావేశం జరిగిందనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ త్వరలోనే ఈ సమస్య పరిష్కారమైతే.. టాలీవుడ్ పెద్ద చిరంజీవి (Chiranjeevi) అని మరోసారి తేలిపోనుంది. నిజానికి టాలీవుడ్ పెద్ద ఎవరనే దానిపై కొన్ని నెలల క్రితం సినీవర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. చిరంజీవి మద్దతుతో మా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఓడిపోవడంతో.. టాలీవుడ్‌లో చిరంజీవి దూకుడుకు గండిపడిందనే ఊహాగానాలు వినిపించాయి.

  ఇక ఇటీవల తాను టాలీవుడ్ పెద్దను కాదని చిరంజీవి స్వయంగా ప్రకటించడం.. ఆ వెంటనే నటుడు మోహన్ బాబు (Mohan Babu) దీనికి కౌంటర్ ఇచ్చే విధంగా కామెంట్లు చేయడం ఆసక్తి రేకెత్తించాయి. టాలీవుడ్ ఓ నలుగురి హీరోలు, నిర్మాతలకు చెందినది కాదని మోహన్ బాబు కామెంట్ చేయడంతో.. ఇక టాలీవుడ్ తరపున ఏపీ ప్రభుత్వంలో చర్చించేందుకు ఎవరు ముందుకెళతారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఉన్నట్టుండి మళ్లీ మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్‌ను కలవడం.. రెండు గంటలకు పైగా సినిమా టికెట్ల ధరలు సహా సినీ రంగానికి సంబంధించిన ఇతర సమస్యలపై చర్చించడం కొత్త ఊహాగానాలకు తెరలేపింది. సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం చర్చించాలని భావిస్తే.. పలువురు నిర్మాతలను చర్చలకు పిలిస్తే సరిపోయేది. అలా కాకపోయినా.. ఇటీవల మా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణుతో (Manchu Vishnu) ఈ అంశంపై చర్చలు జరిపినా జరపొచ్చు.

  కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఈ సమస్యపై చర్చించేందుకు మెగాస్టార్ చిరంజీవికి అవకాశం ఇచ్చారు. సమస్య పరిష్కారం అవుతుందని భావించడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగి సీఎం వైఎస్ జగన్‌తో చర్చించారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని.. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై సీఎం జగన్ కూడా సానుకూలంగానే ఉన్నారని చిరంజీవి అన్నారు.

  అయితే టాలీవుడ్‌లో సమస్యల గురించి చర్చించేందుకు చిరంజీవిని ఆహ్వానించి.. టాలీవుడ్‌ సినీ పెద్ద చిరంజీవే అనే విషయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి చెప్పకనే చెప్పారనే టాక్ టాలీవుడ్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ విషయంలో ఇప్పటివరకు కొందరు భిన్నమైన వాదనలు వినిపించినప్పటికీ.. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ తరువాత మరోసారి ఈ అంశంపై అందరికీ క్లారిటీ వచ్చిందని.. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఓ కారణమనే ప్రచారం సాగుతోంది.

  CM Jagan-Chirnjeevi: సీఎం జగన్-మెగాస్టార్ చిరంజీవిల భేటీకి చంద్రబాబు కారణమా..? అసలు మ్యాటర్ అదేనా..?

  YS Jagan: సీఎం జగన్ అలా డిసైడయ్యారా ?.. అందుకే చిరంజీవితో సమావేశం జరిగిందా ?

  ఇప్పటికే తెలంగాణలోనూ సినీ రంగానికి సంబంధించిన సమస్యలపై ఇక్కడ అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంతో చర్చించేందుకు చిరంజీవి ముందుంటారు. సీఎం కేసీఆర్‌తో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా ఇందుకు మరో కారణం. తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం టాలీవుడ్ సినీ పెద్ద చిరంజీవి అని భావించి ఆయనతో చర్చించేందుకు ముందుకు రావడంతో.. ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి అనే విషయంలో మరోసారి క్లారిటీ వచ్చింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, Chiranjeevi, Tollywood

  ఉత్తమ కథలు