Chiranjeevi - AP CM YS Jagan: చిరంజీవి (Chiranjeevi) నేతృత్వంలో బృందానికి ఏపీ సీఎంవైయస్ జగన్మోహన్ రెడ్డి (AP Chief Minister YS Jagan Mohan Reddy) అపాంట్మెంట్ ఖరారు చేసారు. ఈ భేటిలో చిరంజీవి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీ సీఎం జగన్తో ప్రస్తావించే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. రీసెంట్గా ఏపీ సీఎం కర్నూలు ఎయిర్ పోర్ట్కు మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా పేరు పెట్టడంతో పాటు పలు అంశాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. తాజాగా ఏపీలో థియేటర్స్ టికెట్స్ రేట్స్ పాటు.. డిస్ట్రిబ్యూటర్,ఎగ్జిబిటర్ రంగం ఎదుర్కొంటోన్న పలు సమస్యలను ప్రస్తావించనున్నారు.
ఈ నెల 20న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .. చిరంజీవి నేతృత్వంలోని బృందానికి అపాయింట్మెంట్ ఖరారు చేసారు. ఈ విషయమాన్ని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్నినాని మీడియాకు తెలియజేసారు.ముఖ్యంగా టికెట్ రేట్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీలో నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాయి.
ముఖ్యంగా థియేటర్ యజమానులు అయితే ఇలా అయితే తమ థియేటర్స్ మూసుకుని కళ్యాణ మంటపాలు చేసుకుంటాం అంటున్నారు. సాధారణ టికెట్ రేట్స్ కంటే ఎక్కువగా అమ్మితే మాత్రం కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆదేశించింది.ఈ నేపథ్యంలో చిరంజీవి నేతృత్వంలో నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు ఏపీ సీఎం జగన్ను కలవనున్నారు.
ఈ సందర్భంగా కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావించనున్నారు. ఇప్పటికే కరోనాతో ఎక్కువగా కుదైలన రంగం ఏదైనా ఉందంటే అది చిత్ర పరిశ్రమనే అనే చెప్పాలి. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమను ఆదుకోనులా పలు సూచనలు సలహాలు ముఖ్యమంత్రి ముందు ఉంచనున్నారు. అంతేకాదు గత కొంత కాలంగా కొత్త సినిమాలకు ఏపీలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో బడా స్టార్ హీరోల సినిమాలు రిలీజైనపుడు బెనిఫిట్ షోలు వేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది.
అంతేకాదు పట్టణాలు, నగరాల్లో రోజుకు నాలుగు షోలు రన్ చేసేలా వీలు కల్పించాలన్నారు. అదే విధంగా గ్రేడ్ 2 కేంద్రాల్లో నేల టిక్కెట్టుకు రూ. 10, కుర్చీకి రూ. 20 వసూలు చేసుకునేందుకు పర్మిషన్ కోరనున్నారు. రీసెంట్గా ఏపీ ప్రభుత్వం నేరుగా సినీ టికెట్స్ విక్రయించాలనే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలకు కూడా టిక్కెట్స్ విక్రయించేందకు అనుమతులు ఇవ్వాలనే డిమాండ్ కూడా ప్రభుత్వం ముందు ఉంచనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.